Breaking News

జనాన్ని దోచుకుంటున్న అదానీ

Published on Thu, 10/19/2023 - 05:48

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ మీద కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపణలు ఎక్కుపెట్టారు. బొగ్గు దిగుమతులను విపరీతంగా పెంచి చూపడం ద్వారా ప్రజల నుంచి అదానీ గ్రూప్‌ ఏకంగా రూ.12 వేల కోట్లు దోచుకుందని బుధవారం ఆరోపించారు. ఈ మేరకు పలు మీడియా రిపోర్టులను విలేకరుల ముందు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై తక్షణం విచారణకు ఆదేశించి తన నిర్దోíÙత్వాన్ని రుజువు చేసుకోవాలని సవాల్‌ విసిరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి కాంగ్రెస్‌ అధికారంలోకి ఈ ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశిస్తుందని ప్రకటించారు.

దీనిపై మోదీకి మౌనమెందుకని ప్రశ్నించారు. విచారణకు ఆదేశించి తన విశ్వసనీయతను నిరూపించుకోవచ్చు కదా అని నిలదీశారు. ‘అదానీ ఇండొనేసియాలో కొనుగోలుచేసిన బొగ్గు ధర భారత్‌కు వచ్చేసరికి రెట్టింపు అవుతోంది! ఈ అడ్డగోలు పెంపు కారణంగా భారత్‌లో కరెంట్‌ చార్జీలు పెరిగాయి. వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై సబ్సిడీ భారం పెరిగింది’ అని రాహుల్‌ ఆరోపించారు. ఇలాంటివి ఇంకే దేశంలో జరిగినా ప్రభుత్వాలే పడిపోయేవని ఆయన వ్యాఖ్యానించారు. కానీ మన దగ్గర ఇంత జరిగినా కనీస చర్యలు లేదని ఆరోపించారు. ‘ఒకే ఒక్క వ్యక్తి చేస్తున్న ఈ దారుణ దోపిడీని ప్రధాని చూసీచూడనట్టు పోతున్నారు. ఆయనను పదేపదే కాపాడుతున్నారు’ అని రాహుల్‌ మండిపడ్డారు.

గాందీలది అవినీతి కుటుంబం: బీజేపీ
గాం«దీల కుటుంబమే అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ విమర్శించింది. వారిపై అవినీతి కేసులున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ అన్నారు. అదానీ అంశం సుప్రీంకోర్టులో ఉన్నా రాహుల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయనకు కోర్టు మీద గౌరవం లేదని స్పష్టమవుతోందన్నారు. ‘రాహులే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో బెయిల్‌ మీద ఉన్నారు. వారిది ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతిమయమైన కుటుంబం’ అంటూ మండిపడ్డారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)