Breaking News

కర్ణాటకలో కూలిన విమానం

Published on Mon, 02/09/2026 - 05:51

సాక్షి, బళ్లారి/బనశంకరి: కర్ణాటకలో చిన్నపాటి విమానం కూలిపోయింది. విజయపుర (బిజాపుర) జిల్లా బబళేశ్వర తాలూకా మంగళూరు వద్ద పొలాల్లో రెండు సీట్లు ఉన్న ఈ శిక్షణ విమానం కూలింది. ఇది రెడ్‌బర్డ్‌ పైలట్‌ ట్రైనింగ్‌ ఏవియేషన్‌కు చెందినదని తెలిసింది. ఈ సంస్థ విమాన పైలట్లకు శిక్షణ ఇస్తుంది. ఆదివారం శిక్షణలో భాగంగా ఓ పైలట్, ట్రైనీతో కలిసి కలబుర్గి నుంచి బెళగావికి బయలుదేరింది. అయితే మార్గంమధ్యలో విమానంలో యాంత్రిక లోపం తలెత్తడంతో పైలట్‌ అత్యవసరంగా దించేందుకు యతి్నంచాడు.

పంట కోసిన ఓ మొక్కజొన్న పొలంలో విమానం దిగుతూ పల్టీ కొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌ కెప్టెన్‌ కునాల్‌ మల్హోత్రా, ట్రైనీ పీఆర్‌ గౌతం శంకర్‌కి గాయాలయ్యాయి. కొంతసేపటికి స్థానికులు, పోలీసులు చేరుకుని వారిని విజయపురలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విమానం ఆకాశం నుంచి గిరగిరా తిరుగుతూ పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ధాటికి విమానం మూడు ముక్కలుగా దెబ్బతింది. గాయపడిన వారు నడుస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)