Breaking News

భర్త వస్తాడనుకుంటే మృతదేహం రావడంతో.. సొమ్మసిల్లిన నిండుగర్భిణి!

Published on Mon, 07/17/2023 - 09:47

ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌ నుంచి బాందాకు వస్తున్న 25 ఏళ్ల యువకుడు రైలులో మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలియని అతని భార్య, కుటుంబసభ్యులు.. ఇక​ కొద్ది సేపటిలో అతను వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇంతలో వారికి అసలు విషయం తెలిసింది. దీంతో వారి ఇల్లు శోకసంద్రంగా మారిపోయింది. భర్త ఇక రాడనే సంగతి తెలుసుకున్న భార్య సొమ్మసిల్లి పడిపోయింది. 

ఈ ఉదంతం గురించి బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారుడు రైలులో విషప్రయోగానికి బలైపోయాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారని, తదుపరి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కమాసిన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుజర్‌ భాన్‌ అనే యువకుడు అహ్మదాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అతని కుటుంబం బాందాలో ఉంటోంది. ఆదివారం బరౌనీ-అహ్మదాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి ఇంటికి బయలుదేరాడు. 

రక్తంతో కూడిన వాంతులు..
మహోబా స్టేషన్‌ సమీపంలోకి రైలు చేరుకోగానే ఉన్నట్టుండి అతనికి రక్తంతో కూడిన వాంతులు రావడం మొదలయ్యింది. దీనిని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని సీఆర్‌పీ పోలీసులతో పాటు రైల్వే అధికారులకు తెలియజేశారు. ఇంతలోనే అతని ఆరోగ్యం విషమించింది. వెంటనే జీఆర్‌పీ పోలీసులు బాధితుడిని రైల్వే వైద్యుల దగ్గకు తీసుకువెళ్లారు. వారు బాధితుడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. 

పోలీసులకు మృతుని జేబులో అహ్మదాబాద్‌ నుంచి బాందాకు రైల్‌ టిక్కెట్‌ లభ్యమయ్యింది. డాక్యుమెంట్ల ఆధారంగా మృతుడు బాందాకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారు మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే మృతుని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సూరజ్‌ భాన్‌కు ఇద్దరు పిల్లలు ఉంటేవారు. వారు మృతిచెందారు. ప్రస్తుతం అతని భార్య నిండుగర్భంతో ఉంది. కొద్దిరోజుల్లో ఆమెకు డెలివరీ జరగనుంది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్‌బరీ చాక్లెట్‌.. నాటి తీయని వేడుకకు గుర్తుగా..

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)