Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్‌ నిఘా పెంపు

Published on Wed, 01/29/2025 - 12:06

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుతోంది. అయితే ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుంది. ఈ నేపధ్యంలో సంగమతీరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

తొక్కిసలాట సద్దుమణిగిన దరిమిలా లక్షలాది మంది భక్తులు స్నానం చేయడానికి సంగమ తీరానికి తరలివస్తున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు, మరింతగా భద్రత కల్పించేందుకు హెలికాప్టర్ నుండి  నిఘా సారించారు. జనసమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో  బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే జనం మరింతగా పెరిగిపోవడంతో పోలీసులు బారికేడ్లను తొలగించారు. భద్రతను మరింతగా పెంచేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించారు.

కుంభమేళా పర్యవేక్షణ అధికారులు భద్రత విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మహా కుంభలో పరిస్థితి అదుపులో ఉందని, భక్తుల పుణ్యస్నానాలు సజావుగా జరుగుతున్నయని అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటన అనంతరం సీఎం యోగి స్పందిస్తూ వివిధ గంగా ఘాట్ల వద్ద స్నానాలు చేయాలని భక్తులకు సూచించారు. అధికారులు అందించే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: అలాంటి దుస్తులతో రావొద్దు: ముంబై సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)