Breaking News

ప్రగతి మైదానం ఇకపై ‘భారత్‌ మండపం’

Published on Sat, 03/09/2024 - 07:31

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ను ఇకపై ‘భారత్‌ మండపం’గా పిలువనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) ఈ కాంప్లెక్స్‌కు ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టింది. ‘భారత్ మండపం’ పేరుతో జీ-20 శిఖరాగ్ర సమావేశం గతంలో ఇక్కడ జరిగింది. దీనిని అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలకు కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. 

ప్రగతి మైదాన్‌ను ‘భారత్‌ మండపం’ అని పేర్కొంటూ ఐటీపీఓ తన వెబ్‌సైట్‌లోనే కాకుండా ప్రవేశ ద్వారాల వద్ద కూడా ఈ రాయించింది. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి ప్రగతి మైదాన్‌ అని నామకరణం చేశారు. అదే సంవత్సరం ఇందిరా గాంధీ ప్రారంభించిన ఆసియా- 72 ప్రదర్శన ఇక్కడ జరిగింది. అప్పటి నుండి ప్రగతి మైదాన్ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారింది. 

ఐటీపీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రగతి మైదాన్ క్యాంపస్‌కు భారత్ మండపం అని నామకరణం చేశామన్నారు. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్. మరొకటి వివిధ ఎగ్జిబిషన్ హాల్స్. ఈ పేరు మార్పు  38వ అంతర్జాతీయ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్-2024తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు, ఆహ్వాన పత్రికలు, టిక్కెట్లు, పాస్‌లు ఇలా ప్రతిదానిలో ప్రగతి మైదాన్ అని కాకుండా భారత్ మండపం అని ముద్రించారు. 
 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)