Breaking News

ఎమ్మెల్యే కొడుకుపై అత్యాచార ఆరోపణలు..?

Published on Mon, 07/21/2025 - 08:11

కర్ణాటక: కాబోయే భార్యను అత్యాచారం, మోసం చేశాడని ఆరోపణలు వచ్చిన బీదర్‌ జిల్లా ఔరాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్‌ కుమారుడు ప్రతీక్‌ చౌహాన్‌ గొడవ ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ప్రతీక్‌ చౌహాన్‌పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె శనివారంనాడు బెంగళూరులో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 2023 డిసెంబరులో తమకు నిశ్చితార్థం అయ్యింది, అప్పటినుంచి కలిసి మెలిసి తిరిగామని పేర్కొంది. 

తామిద్దరం గదిలో ఉన్నట్లు సాక్ష్యాలను విడుదల చేసింది.  నిశ్చితార్థానికి ముందే ప్రతీక్‌ చౌహాన్‌ తనను బెంగళూరులోని రేస్‌కోర్స్‌ సమీపంలోని హోటల్‌కు తీసుకొచ్చాడని, అక్కడ ఏకాంతంగా గడిపామని తెలిపింది. మహారాష్ట్రలోని ఓ హోటల్‌కు కూడా తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నాడని వాపోయింది. చివరకు గొడవలు పుట్టించి పెళ్లి చేసుకోనని వంచించారని ఆరోపించింది. వారి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌ అయ్యాయి.  

అంతా కుట్ర: ప్రభుచౌహాన్‌ 
ఇదంతా కుట్ర, ఇందులో బీజేపీ మాజీ కేంద్రమంత్రి భగవంత ఖూబా అనుచరుల హస్తం ఉన్నట్టు ప్రభు చౌహాన్‌ ఆరోపించారు. ఆదివారంనాడు బీదర్‌లో విలేకరుల భేటీ ఏర్పాటు చేసి మాట్లాడారు. తనపై, కుమారునిపై కుట్రతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. యువతికి ఖూబా అనుచరుల అండదండలు ఉన్నాయన్నారు. తన కుమారునికి ఎలాంటి పరీక్షలు అయినా చేసుకోవచ్చని, అతడు అలాంటి వ్యక్తి కాదని అన్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)