Breaking News

సీబీఐ దాడులు.. పోస్టాఫీస్‌ ఉద్యోగి ఆత్మహత్య

Published on Wed, 08/21/2024 - 14:19

సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో.. మనస్తాపం చెందిన ఓ పోస్టల్‌ అధికారి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోట్లాది రూపాయల అవకతవకలపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు పోస్టాఫీసుపై దాడి చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ప్రధాన పోస్టాఫీసుపై మంగళవారం అర్థరాత్రి సీబీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు దాడులు చేశారు. రిటైర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ సహా ఎనిమిది మందికి పైగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో పోస్టల్‌ సూపరింటెండెంట్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ బుధవారం ఉదయం అలీగఢ్‌లోని తన ఇంట్లో లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సీబీఐ దాడులతో  త్రిభువన్‌ ఒత్తిడికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ జరుపుతున్నారు. సింగ్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.

అయితే దాడులతో ఒత్తిడికి గురయ్యాడనే ఆరోపణలను మృతుడి కుటుంబ సభ్యులు ఖండించారు. తనను ఒక మహిళ, కొందరు అధికారులు తమ వద్ద పని చేయమని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రతాప్‌ సింగ్‌ సోదరుడు బాధితుడు రాసిన ఆత్మహత్య లేఖను వాట్సాప్‌లో షేర్‌ చేశాడు. తన అధికారిక లెటర్‌హెడ్‌తో కూడిన కాగితంపై హిందీలో రాసిన నోట్‌లో.. చాలా మంది సహోద్యోగులు తమ ఆదేశాల ప్రకారం పనిచేయమని తనను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

#

Tags : 1

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)