Breaking News

16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్‌

Published on Sun, 10/06/2024 - 12:53

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఎవరి ​ఊహకూ అందని ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను పోలీసులు రక్షించిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.

జహంగీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మహిళను ఆమె అత్తమామలు 16 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించారు. బాధితురాలు రాణి సాహుకు 2006లో వివాహం జరిగింది. మొదట్లో సంసారం బాగానే ఉన్నా 2008 నుండి అత్తామామలు ఆమెను ఒక్కసారి కూడా పుట్టింటికి పంపలేదు. తాజాగా ఆమె తండ్రి కిషన్‌ లాల్‌ సాహూ తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని, మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

2008 నుంచి తన కూతురు రాణి సాహును కలవడానికి తమను అనుమతించడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్‌స్టేషన్‌ బృందం జహంగీరాబాద్‌లోని కోలి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఇంట్లోని మూడో అంతస్తులో ఒక మంచంపై రాణి సాహు హృదయవిదారక స్థితిలో పడివుండటాన్ని వారు గమనించారు. ఆమె శరీరం ఎముకల గూడుగా మారడాన్ని చూసి వారు కంగుతిన్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక, ఆమె నుంచి వివరాలు సేకరించి  ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్‌ ట్రావెల్స్‌’

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు