Breaking News

డీఎస్పీకి కానిస్టేబుల్‌గా డిమోషన్‌.. ఏం జరిగిందంటే!

Published on Sun, 06/23/2024 - 14:23

లక్నో:  ఓ మహిళా కానిస్టేబుల్‌తో అనైతిక సంబంధం పెట్టుకోవటం ఓ పోలీసు అధికారికి మాయని మచ్చగా మిగిలింది. అదీకాక, డీఎస్పీ స్థాయి నుంచి ఒ​క్కసారిగా కానిస్టేబుల్‌ స్థాయికి డిమోషన్‌ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన మూడేళ్ల తర్వాత పోలీసులు ఆయనపై తాజాగా చర్యలు తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళ్లితే.. కృపా శంకర్ కన్నౌజియా కానిస్టేబుల్‌ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి కష్టపడి ఎదిగారు. ఆయన 2021లో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో తరచూ కుటుంబ సమస్యల పేరుతో సెలవు పెట్టేవారు. అయితే ఆయన ఇంటికి వెళ్లే బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లారు. 

ఈ క్రమంలో వ్యక్తిగత, అధికారిక ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేశారు. దీంతో తన భర్త ఇంటికి రాకపోవటం, ఫోన్లు సైతం కలువకపోవడంతో ఆందోళనపడిన ఆయన భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్‌ టీంలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా కాన్పూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆయన మహిళా కానిస్టేబుల్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఈ వ్యవహారంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆధారాలు సేకరించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సిఫార్సు చేశారు. దీంతో డీఎస్పీగా ఉన్న ఆయన్ను గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబుల్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోషన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)