Breaking News

బిర్యానీ ప్రియులకు భారీ షాక్‌..!

Published on Sun, 07/27/2025 - 08:17

కర్ణాటక: బెంగళూరు వాసులతో పాటు టూరిస్టులు మెచ్చిన ఫుడ్‌ స్పాట్‌ అంటే హొసకోటె కూడా ఒకటి. ఇందుకు కారణం అక్కడ లభించే మటన్, చికెన్‌ బిర్యానీ. తెల్లవారుజామున 4 ఏఎం బిర్యానీగా చాలా ఫేమస్‌. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇది పొద్దున్నే తినడం ఆరోగ్యానికి మంచిదా, కాదా అనే ఆలోచన ఉండదు. ఇకపై 4 ఏఎం బిర్యానీ దొరకదు. బెంగళూరు నుంచి 30 కి.మీ.ల దూరంలో ఉండే హొసకోటె గత కొన్నేళ్లుగా వేకువజాము బిర్యానీ వల్ల పేరుగాంచింది. చాలా మంది ఉదయాన్నే జాలీరైడ్‌కు వెళ్లి బిర్యానీ తిని రావడాన్ని అలవాటుగా మార్చుకున్నారు.  కుప్పలుగా క్యూలో నిలబడి తినే వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బిర్యానీ తింటూ సెల్ఫీలు, వీడియోలు తీసి ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో పోస్టు చేయడం ట్రెండింగ్‌గా మారింది.  

  1. అన్నీ సమస్యలే.. అందుకే  
    ఈ వ్యాపారానికి స్థానిక పోలీసులు షాక్‌ ఇచ్చారు. ఇకపై తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీ అమ్మరాదు అని హోటళ్లవారిని హెచ్చరించారు.  

  2. రెండు గంటలు లేటుగా 6 గంటలకు బిర్యానీ అమ్మకాలు షురూ చేయమని వారం నుంచి ఆదేశించారు.  

  3. కారణాలపై పోలీసు అధికారులు స్పందిస్తూ  4 గంటలకే బిర్యానీ కోసం పొడవైన క్యూలు ఏర్పడుతున్నాయి. దీంతో తోపులాట, గొడవలు జరుగుతున్నాయి.  

  4.  రోడ్ల పక్కన బైక్‌లు, కార్లతో నిండిపోతోంది. బిర్యానీ తినాలనే ఆతృతతో రాత్రి 12 గంటల నుంచే బయల్దేరుతుంటారు. కొందరు మద్యం మత్తులో, గంజాయి మత్తులో వస్తుంటారు.  

  5. తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంకా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకే వేళను మార్చాం అని తెలిపారు.  

  6. దీంతో హోటళ్లవారు అయిష్టంగానే వేళలను మార్చారు.  

  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)