Breaking News

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. 15 రోజుల్లో 34 మంది హతం

Published on Fri, 01/17/2025 - 08:58

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. ఈ క్రమంలో 2025 ఏడాది ప్రారంభం నుంచే మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జనవరిలో ఎన్‌కౌంటర్ల కారణంగా 15 రోజుల వ్యవధిలో ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh)లో భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. ఈనెల ఆరో తేదీన బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల(maoists) బెద్రే _కుట్రు ఘటనతో భద్రతా బలగాలు అలర్ట్‌ అయ్యాయి. మావోయిస్టుల ఘాతకంతో ఎనిమిది మంది జవాన్లు, డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనతో అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ కగార్‌ చేపట్టాయి. ఇందులో భాగంగా 15 రోజల సమయంలో 34 మంది మావోయిస్టులను హతమార్చారు. తాజాగా బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాలకు చెందిన నక్సలైట్లు మృతి చెందారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వీరిలో తెలంగాణ కేడర్‌కే చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటన.. బీజాపూర్‌ జిల్లా బాసగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్‌ కానిస్టేబుళ్లు మృదుల్‌ బర్మన్, మహ్మద్‌ ఇషాఖ్‌ గాయపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.

రాష్ట్ర సరిహద్దుల్లో ఘటన
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పూజారి కాంకేర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్‌ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో తొలిసారిగా కాల్పులు మొదలయ్యాయి. అప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 19 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే మృతులు ఎవరు? ఎంత మంది చనిపోయారనే అంశంపై అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు