Hathras Stampede: అన్ని మృతదేహాలను ఒకేచోట చూసేసరికి..

Published on Wed, 07/03/2024 - 09:29

యూపీలోని హత్రాస్‌లో తొక్కిసలాట తర్వాత సమీప ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపించాయి. ఇవి చూపరుల హృదయాలను కలచివేశాయి. ఎంతటి గుండెధైర్యం కలిగినవారైనా అన్ని మృతదేహాలను ఒకేచోట చూస్తే వారి మనసు కల్లోలమవుతుంది. ఒక కానిస్టేబుల్‌ ఇటువంటి అనుభవానికే లోనై, చివరికి ప్రాణాలు కోల్పోయాడు.  

హత్రాస్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం  కోసం ఎటా మెడికల్‌ కాలేజీకి తరలించారు. పోస్ట్‌మార్టం హౌస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవికుమార్ మృతదేహాలను అక్కడికి తీసుకురావడాన్ని గమనిస్తున్నాడు. అ‍క్కడికి వస్తున్న మృతదేహాల సంఖ్య లెక్కకుమించి ఉండటానికి తోడు, బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటడం రవికుమార్‌ మనసును తీవ్రంగా కలచివేశాయి.

అతనిలో గుండె దడ మొదలయ్యింది. కొద్ది క్షణాలకే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే తోటి కానిస్గేబుల్‌ లలిత్ కుమార్ అతనిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించాడు. వైద్య చికిత్స తీసుకుంటూనే 20 నిమిషాల తర్వాత రవికుమార్ మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రవి కుమార్‌ బన్నా దేవి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా సిద్ధార్థ్ నగర్‌లో నివసిస్తున్నాడు. 2022 నుండి అవగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. హత్రాస్‌ ప్రమాదం నేపధ్యంలో రవికుమార్‌ను ఎటా మెడికల్‌ కాలేజీ మార్చురీ వద్ద విధులలో నియమించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)