Breaking News

విభజన హామీలకు ప్రైవేటు మెంబర్‌ బిల్లు

Published on Sat, 08/05/2023 - 03:46

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి వైఎ­స్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ శుక్రవారం లోక్‌సభ­లో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ­పెట్టా­రు. ప్రత్యేక హోదా, పోలవరం సవరించిన అంచనాలతో సహా పలు హామీల అమలుకు సంబంధించిన అంశాలను ఆయన బిల్లులో పొందుపరి­చారు. అనంతరం ఏపీ భవన్‌లో భరత్‌ మీడియా­తో మాట్లాడా­రు. విభజన హామీలను అమలుచే­యా­లంటూ రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లు­ను పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రవే­శపెట్టారని.. ద్రవ్య బిల్లు అని చెప్పడంతో లోక్‌సభ­లో ప్రవేశపె­ట్టామని తెలిపారు.

బిల్లులో ప్రత్యేక హోదాను ప్రధానంగా ప్రస్తావించామని, వెనక­బడి­న జిల్లాల­కు ప్యాకేజీ, రైల్వేజోన్‌ తదితర అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు తప్పిదా­లను సవరిస్తూ ఏపీకి రావాల్సినవి తీసుకొ­స్తున్నా­మని భరత్‌ వివరించారు. అ­లాగే, పోలవరం సవ­రిం­చిన అంచనాల ఆమో­దానికి సంబంధించి లోక్‌­సభాపక్ష­నేత మిథున్‌రెడ్డి మరో బిల్లు ప్రవేశపె­డతారని భరత్‌రామ్‌ తెలి­పారు. ప్రజా­ప్రయోజన బిల్లులకే పార్లమెంటులో మద్దతిస్తున్నా­మన్నారు. ప్రైవేటు మెంబరు బిల్లులు ఎందుకు ప్రవేశ­పెడు­తున్నామో కేంద్రం ఆలోచించాలని ఎంపీ భరత్‌  తెలిపారు. ఏపీ విభజన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించా­రు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఒక పెట్రో కెమికల్‌ రిఫైనరీ తీసుకురావాల్సి ఉందని, దానికి వయబి­లిటీ గ్యాప్‌ ఫండ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టు­కో­వా­ల­న్నా­రు. 

గోడ మీద పిల్లిలా టీడీపీ..
ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై టీడీపీ వ్యవహారం గోడ మీద పిల్లిలా ఉందని భరత్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పు­లపై పార్లమెంటులో ప్రశ్నలు వేసి టీడీపీ ఎంపీలు అభాసుపాలయ్యారన్నారు. లోకేశ్‌కు ధైర్య­ముంటే తనపై ఎంపీగా పోటీచేయాలని సవాల్‌ విసిరారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)