Breaking News

బాధితురాలే.. నిందితురాలు

Published on Thu, 09/04/2025 - 12:27

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కేరళ పూజారిపై బెంగళూరు మహిళ లైంగికదాడి కేసు  పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మలుపు చోటుచేసుకుంది. చివరకు హనీట్రాప్‌గా మారి బాధిత మహిళే నిందితురాలు అయ్యింది. కేరళలోని త్రిస్సూరులోని ప్రసిద్ధ పెరింగొట్టుకర దేవాలయంలో ఓ పూజారిగా పని చేస్తున్న ఉన్ని దామోదరన్‌ పై బెంగళూరు బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఒక మహిళ అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఇది జరిగింది. తన భర్త చనిపోయి తాను కష్టాల్లో ఉండగా, పూజారిని కలిసి పరిష్కారం కోరానని, క్షుద్రపూజలు చేయిస్తానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. పోలీసులు త్రిస్సూరుకు వెళ్లి పూజారి దామోదరన్, ఆలయం ఉద్యోగి అరుణ్‌ని అరెస్టు చేశారు.  

హోంమంత్రికి కుటుంబం ఫిర్యాదు... 
పూజారి కుటుంబ సభ్యులు హోంమంత్రి పరమేశ్వర్‌ని కలిసి ఇదంతా కట్టుకథ అని, అకారణంగా అబద్దపు కేసు నమోదు చేశారని,  హనీ ట్రాప్‌ కుట్ర అని ఫిర్యాదు చేయగా, విచారణ చేయాలని ఆయన పోలీసులకు ఆదేశించారు. దర్యాప్తు చేసిన పోలీసులు మహిళ ఇచ్చింది అబద్ధపు ఫిర్యాదుగా పేర్కొన్నారు. పూజారిని అప్రతిష్టపాలు చేయడంతో పాటు కేసు వెనక్కు తీసుకోవాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.    

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)