Breaking News

క్రీడాకారుల జుగల్‌బందీ 

Published on Mon, 06/01/2026 - 05:25

సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో ప్రతిభా పాటవాలు చాటుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అథ్లెటిక్స్‌ రంగంలో దేశ క్రీడాకారులు సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఆదివారం 134వ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ఆయన రేడియోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారుల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. 

ముఖ్యంగా జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ పోటీల్లో నాలుగు కొత్త జాతీయ రికార్డులు నెలకొల్పిన క్రీడాకారులపై ప్రశంసల వర్షం కురిపించారు. గురీందర్‌వీర్‌ సింగ్, విశాల్‌ టీకే, తేజస్విన్‌ శంకర్, దేవ్‌ మీనా, కులదీప్‌ కుమార్‌... ఈ స్నేహితులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులు నెలకొల్పారని చెప్పారు. ముఖ్యంగా 100 మీటర్ల పరుగు పందెంలో రెండు రోజుల వ్యవధిలో పాత రికార్డులను మూడుసార్లు బద్ధలుకొట్టిన అనిమేశ్‌ కుజూర్, గురిందర్‌వీర్‌ సింగ్‌లతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వీరిద్దరి పోటీని క్రీడల్లో ‘జుగల్‌బందీ’గా అభివర్ణించారు. 

భారతీయుల శరీరాకృతి స్ప్రింటింగ్‌కు పనికిరాదనే అపోహలను పటాపంచలు చేస్తూ 10.1 సెకన్లలోపు పరుగు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన నావికాదళ అధికారి గురిందర్‌వీర్‌ను, ఫుట్‌బాల్‌ నుంచి అథ్లెటిక్స్‌లోకి వచ్చి రాణిస్తున్న అనిమేశ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. మైదానం బయట స్నేహితులుగా, మైదానంలో పోటీదారులుగా ఉంటూ దేశ గౌరవాన్ని పెంచుతున్న వీరి క్రీడాస్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే...  

దేశీయ పానీయాలను ఆస్వాదించండి  
‘‘దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండల్లో డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగినంత నీరు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం జారీ చేసే సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వేసవి వేడిని తట్టుకునే అద్భుతమైన మార్గాలు మన వంటగదిలోనే ఉన్నాయి. ఉత్తర భారతదేశపు ఆమ్‌ పన్నా, పంజాబీ లస్సీ, రాజస్తానీ–గుజరాతీ మజ్జిగలతో పాటు బిహార్, జార్ఖండ్‌ల సత్తు షర్బత్, కొంకణ్‌ కోకుమ్‌ షర్బత్, దక్షిణ భారతదేశపు పానకం, నీర్‌ మోర్‌ వంటి సాంప్రదాయ పానీయాలు కేవలం దాహాన్ని తీర్చేవి మాత్రమే కావి.. అవి ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ దేశీయ పానీయాలను ఆస్వాదించాలి. 

గ్లోబల్‌ మార్కెట్‌కు మన మామిడి  
వేసవిలో వచ్చే ఫలరాజం మామిడి పండ్ల ప్రస్తావన రాని ఇల్లు ఉండదు. అల్ఫాన్నో, కేసర్, దశేరీ, లంగ్రా, చౌసా, మాల్డా వంటి మామిడి రకాలు మనకు ఉన్నాయి. ప్రతి పేరుతో ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి వెళితే బంగినపల్లి, తోతాపురీ, నీలం, మాల్గోవా, సువర్ణరేఖ వంటి రకాలు కనిపిస్తాయి. ప్రదేశం మారితే మామిడి పండు ఆకారం, రంగు, రుచీ మారుతాయి. మన మామిడి ప్రయాణం ఇప్పుడు గ్రామాల నుండి గ్లోబల్‌ మార్కెట్‌కు చేరుకుంటోంది.  పడవ ప్రమాదంలో విద్యార్థులు చనిపోయిన ఘటనతో కలత చెంది, కేరళంలో ఉచితంగా 15 వేల మందికి పైగా ఈత నేర్పించిన సాజీ వలాశేరిల్‌ సేవలు నిజంగా ప్రశంసనీయం. దివ్యాంగ పిల్లలకూ ఈత నేర్పించారు. యూపీ కాలువలో చిక్కుకున్న గంగా డాలి్ఫన్‌ను 13 గంటల పాటు శ్రమించి కాపాడి రాప్తి నదిలోకి విడిచిపెట్టిన సిబ్బందిని అభినందిస్తున్నా.  

గిరిజా అమ్మ దేశభక్తికి సలాం  
తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు గిరిజా అమ్మ గొప్ప దేశభక్తికి ప్రతీక. ‘మన్‌ కీ బాత్‌’ స్ఫూర్తితో ఆమె పనిచేశారు. సైనికుల కోసం రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 విరాళం ఇచ్చేలా తన పరిధిలోని 15 పాఠశాలల విద్యార్థులను ఆమె ప్రోత్సహించారు. అలా సేకరించిన రూ.40 లక్షల చెక్కును ఆమె నాకు అందజేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో మనోరమ నదిని శుభ్రం చేసిన యువకుడు ఆకాశ్‌ గుప్తా, గోవాలో పైప్‌లైన్లు వేసి నీటి సమస్యను పరిష్కరించిన తీర్చిన రిటైర్డ్‌ టీచర్‌ బాలకృష్ణ అయ్యర్‌ సేవలు అభినందనీయం’’ అని అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)