Breaking News

స్టార్టప్‌లలో నాయకత్వ  స్థానానికి ఎదగాలి: మోదీ 

Published on Sat, 01/17/2026 - 05:26

న్యూఢిల్లీ: దేశంలో స్టార్టప్‌  కంపెనీలు, ఆవి చేసే నవీన ఆవిష్కరణలపై సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ ట్రెండ్స్, టెక్నాలజీలో భారత్‌ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. కృత్రిమ మేధ(ఏఐ)లో మనం ముందంజలో ఉండాలని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ‘స్టార్టప్‌ ఇండియా’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

రాబోయే పదేళ్లలో నూతన స్టార్టప్‌ ఆవిష్కరణలు, సాంకేతికతకు మనమే సారథ్యం వహించేలా ఎదగాలని పేర్కొన్నారు. నూతన ఆలోచనలు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అదే సమయంలో నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందించాలని స్టార్టప్‌ కంపెనీలను కోరారు. ముఖ్యంగా తయారీ, పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈనాటి పరిశోధనే రేపటి మేధో సంపత్తి అవుతుందన్నారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వడానికి, నిధులు అందజేయడానికి తమ ప్రభుత్వం పలు పథకాలు తీసుకొచి్చనట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. కాలం చెల్లించిన నిబంధనలు తొలగించామని అన్నారు. 

స్టార్టప్‌ల ప్రతినిధులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్టార్టప్‌ ఇండియా మిషన్‌ ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా అభివరి్ణంచారు. మన దేశంలో 2014లో కేవలం నాలుగు స్టార్టప్‌లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 2 లక్షలకు చేరిందని హర్షం వ్యక్తంచేశారు. 125 యాక్టివ్‌ యూనికార్న్‌ కంపెనీలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచంలో మూడోఅతిపెద్ద స్టార్టప్‌ల వ్యవస్థ మన దేశంలోనే ఉందన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి కంపెనీలు ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు. 45 శాతం స్టార్టప్‌ కంపెనీల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ లేదా భాగస్వామి ఉండడం సంతోషం కలిగిస్తోందని ఉద్ఘాటించారు.

Videos

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)