Breaking News

PM Narendra Modi: ప్రధాని గొంతే నొక్కజూస్తారా!

Published on Tue, 07/23/2024 - 05:27

సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అందుకు పార్లమెంటును కూడా దురి్వనియోగం చేసే ప్రయత్నంలో పడ్డాయని మండిపడ్డారు. ఆ క్రమంలో ప్రధానమంత్రి గొంతునే నొక్కే పోకడలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌పై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘‘లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలను పక్కన పెట్టి వచ్చే ఐదేళ్లలో దేశాభివృద్ధి కోసం పారీ్టలన్నీ ఒక్కతాటిపైకి రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘పార్లమెంటు ఉన్నది ఏదో ఒక్క పార్టీ కోసం కాదు. మొత్తం దేశం కోసం’’ అంటూ విపక్షాలను ఉద్దేశించి హితవు పలికారు. ‘‘మళ్లీ 2029 జనవరిలో మరోసారి లోక్‌సభ ఎన్నికల క్షేత్రంలోకి దిగండి. కావలిస్తే అందుకు పార్లమెంటును కూడా వాడుకోండి. అప్పటిదాకా ప్రజా సంక్షేమం కోసం పాటుపడదాం’’ అని పిలుపునిచ్చారు. 

విపక్షాల తీరు మారాలి 
సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని విపక్షాల తీరుతో ఆయా పార్టీల ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశమే రాలేదని మోదీ అన్నారు. ‘‘ఇది విచారకరం. అన్ని పారీ్టలు సభ్యులందరికీ, ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన వారికి మాట్లాడే అవకాశమివ్వాలి. తొలి సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగించాయి. దాంతో 140 కోట్ల భారతీయుల ఆదేశంతో ఎన్నికైన ప్రభుత్వ స్వరం పదేపదే మూగబోయింది. ఇవి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. నిజానికి ప్రతికూల రాజకీయాలకు మన పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడూ స్థానం లేదు’’ అన్నారు.

ఇది అమృతకాల బడ్జెట్‌ 
మేం ప్రవేశపెట్టబోతోంది అమృతకాల బడ్జెట్‌. వచ్చే ఐదేళ్లకే గాక 2047 నాటికి వికసిత్‌ భారత్‌ను సాకారం చేసుకునే కలకు పునాది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)