నేతాజీని స్ఫూర్తిగా తీసుకోండి

Published on Fri, 01/24/2025 - 06:04

న్యూఢిల్లీ: ­భావిభారత పౌరులైన విద్యార్థులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని పరాక్రమ్‌ దివస్‌ కార్యక్రమంలో భాగంగా పాత పార్లమెంట్‌ భవంతిలో నేతాజీ చిత్రపటం వద్ద మోదీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి తర్వాత మోదీ ప్రసంగించారు. ‘ నాడు స్వరాజ్యం కోసం ప్రజలు ఐక్యంగా మెలిగారు. నేడు ప్రజల మధ్య అదే ఐక్యత సాధిస్తే అది వికసిత భారత్‌కు బాటలు వేస్తుంది. దేశాన్ని బలహీనపరిచే, దేశ ఐక్యతను నీరుగార్చే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నేతాజీ నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించాలన్న లక్ష్యంగా ముందుకుసాగే మనందరికీ నేతాజీ సదా స్ఫూర్తినందిస్తూనే ఉంటారు. 

కంఫర్ట్‌ జోన్‌ను వీడదాం
తర్వాత మోదీ కటక్‌లో జరిగిన పరాక్రమ్‌ దివస్‌ కార్యక్రమంలోనూ వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ నేతాజీ ఎప్పుడూ తాను సౌకర్యవంతమైన జీవితం(కంఫర్ట్‌జోన్‌లో) గడపాలనుకోలేదు. దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్‌ సాకారం కావాలంటే మనందరం కంఫర్ట్‌ జోన్‌ను వీడి కష్టించి పనిచేయాలి. ప్రపంచస్థాయి అత్యుత్తమ పనితీరు కనబరచాలి. మెరుగైన పనితీరు మీద దృష్టిపెట్టాలి. అభివృద్ధి చెందిన భారత్‌నే సుభాష్‌ చంద్రబోస్‌ కలలుగన్నారు. వికసిత్‌ భారత్‌ను సాక్ష్యాత్కారింపజేసుకుని నేతాజీకి నిజమైన నివాళులు అర్పిద్దాం’’ అని అన్నారు. 

నిజమైన నేత
చర్చలో పాల్గొన్న విద్యార్థులతో మోదీ మాట్లాడారు. నేతాజీ బోధనల్లో నీకేం ఇష్టం? అని ఒక అమ్మాయిని అడగ్గా.. ‘‘నాకు మీ రక్తం ఇవ్వండి. నేను మీకు స్వా తంత్య్రాన్ని ఇస్తా.. అనే మాటలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. అన్నింటికన్నా ఆయనకు దేశమే ముఖ్యం. దేశంలో కర్భన ఉద్గారాల వెల్లడిని తగ్గించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. ఇందుకోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు, బస్సులు వాడాలి’’ అని అమ్మాయి చెప్పింది. దీంతో మోదీ కల్పించుకుని.. ‘‘ మా ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందికదా. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 1,200 విద్యుత్‌ బస్సులను సమకూర్చింది. మరిన్ని అందుబాటులోకి తేనుంది. పీఎం సురక్షా యోజన సైతం తెచ్చాం. ఇంటి పైకప్పుపై సౌరఫలకాల వ్యవస్థ ఏర్పాటుచేసుకుంటే నెలనెలా విద్యుత్‌ బిల్లుల బాధ ఉండదు’’ అని మోదీ అన్నారు.

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)