Breaking News

స్పెషల్‌ బ్లూ జాకెట్‌లో ప్రధాని మోదీ!

Published on Wed, 02/08/2023 - 13:12

అందరి దృష్టిని ఆకర్షించేలా స్పెషల్‌ బ్లూ జాకెట్‌ని ధరించి పార్లమెంట్‌కి వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ ధరించిన జాకెట్‌ని రీసైకిల్‌ చేసిన పీఈటీ బాటిళ్లతో తయారుచేసింది. బెంగళూరులో సోమవారం జరిగి ఇండియా ఎనర్జీ వీక్‌ సందర్భంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రధాని మోదీకి ఈ స్పెషల్‌ జాకెట్‌ని బహుకరించింది. ఈ ఎనర్జీ వీక్‌ అనేది శక్తి పరివర్తన హౌస్‌గా ఎదుగుతున్న భారత్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించేందకు ఉద్దేశించింది.

ఈ మేరకు మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నందున బుధవారం పార్లమెంట్‌లో ఆయన ఈ జాకెట్‌లో కనిపించారు. కాగా ఇండియా ఆయిల్‌ ఉద్యోగులు సాయుధ దళాల కోసం ఇలాంటి దుస్తులను తయారు చేసేలా దాదాపు 10 కోట్ల పీఈటీ బాటిళ్లను రీసైకిల్‌ చేయనున్నారు. అదీగాక ఇటీవల ప్రభుత్వం సుమారు రూ. 19 వేల కోట్లతో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ని ప్రారంభించింది.

శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేలా, కార్బన్‌ తీవ్రతను కూడా తగ్గించే దిశగా ఈ మిషన్‌ని ఏర్పాటు చేసింది. అలాగే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇంధన పరివర్తన నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి రూ. 35 వేల కోట్లను అందించారు. అంతేగాదు ఆ బడ్జెట్‌లో దాదాపు ఏడు ప్రాధాన్యతల్లో హరిత వృద్ధికి స్థానం కల్పించారు కూడా. 

(చదవండి: సిగ్నల్‌ వద్ద బ్రేక్‌ బదులు ఎక్స్‌లేటర్‌ తొక్కడంతో..ఇద్దరు మృతి)

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)