Breaking News

మోదీ ఆహ్వానం.. భారత్‌కు సునీతా విలియమ్స్‌ రాక

Published on Wed, 03/19/2025 - 07:38

ఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ భూమికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్‌ రాకపై భారత ప్రధాని మోదీ స్పందించారు. సునీత సాధించిన విజయాల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయులు ఎంతగానో గర్విస్తున్నారని మోదీ అన్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్‌ను మోదీ భారత్‌కు ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు రాసిన లేఖను ఢిల్లీలో తనను కలిసిన నాసా మాజీ వ్యోమగామి మైక్‌ మాసిమినోకు అందించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ లేఖలో..‘మీరు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా మా అందరి హృదయాలకు ఎప్పుడూ అత్యంత సన్నిహితంగానే ఉంటారు. అతి త్వరలో మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఆత్రుతగా ఉన్నాం. తిరిగి రాగానే భారత్‌కు రండి. అద్వితీయ విజయాలు సాధించిన మీవంటి ఆత్మియ పుత్రికకు ఆతిథ్యమిచ్చేందుకు దేశం ఎదురు చూస్తోంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాను’ అంటూ సునీతకు లేఖ రాశారు. 

ఈ క్రమంలో మోదీ లేఖపై సునీతా విలియమ్స్‌ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్బంగా ఆమె సోదరి ఫాల్గుని పాండ్యా మీడియాతో మాట్లాడుతూ.. సునీతా విలియమ్స్‌ తిరిగి భూమికి చేరుకోవడం ఆనందంగా ఉంది. త్వరలో భారత్‌లో పర్యటిస్తారు. మేమందరం కలిసి టూర్‌కు వెళ్లాలని కూడా ప్లాన్‌ చేస్తున్నాం. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇదే సమయంలో సునీత మరోసారి అంతరిక్ష యాత్ర చేపడతారా? అని ప్రశ్నించగా.. అది ఆమె ఎంపిక అని చెప్పుకొచ్చారు. అనంతరం, మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)