Breaking News

ఎట్టకేలకు కశ్మీర్‌ లోయలో రైలు సేవలు

Published on Fri, 03/28/2025 - 06:04

శ్రీనగర్‌: పర్వతమయ కశ్మీర్‌ లోయలో వచ్చే నెలలో రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఏప్రిల్‌ 19వ తేదీన కట్రా–శ్రీనగర్‌ రైలు సేవలను ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. నూతన రైలు సర్వీస్‌ ప్రారంభోత్సవాన్ని చిరస్మరణీయంగా మార్చేందుకు కొత్త మార్గంలో వందేభారత్‌ రైలును నడపాలని అధికారులు నిర్ణయించారు. 

నూతన సర్వీస్‌ను ప్రధాని మోదీ స్వయంగా వచ్చి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతకుముందు చినాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెనను మోదీ పరిశీలించనున్నారు. తర్వాత కట్రాలో రైలు సేవలను ప్రారంభించి అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.

 ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి జితేందర్‌ సింగ్, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, స్థానిక బీజేపీ నేతలు తదితరులు పాల్గొంటారు. రైలును కొంతకాలం కట్రా, శ్రీనగర్‌/బారాముల్లా స్టేషన్ల మధ్య నడుపుతారు. జమ్మూ రైల్వేస్టేషన్‌ విస్తరణ పనులు పూర్తయ్యాక ఆగస్ట్‌ నెల నుంచి జమ్మూ దాకా ఈ రైలు సేవలను విస్తరిస్తారు. 

అప్పటి నుంచి రైలు సేవలు జమ్మూ–శ్రీనగర్‌/ బారాముల్లా మార్గంలో కొనసాగనున్నాయి. ఇంతవరకు ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు నేరుగా ఒక్క రైలు సర్వీస్‌ కూడా లేదు. దశాబ్దాలుగా కశ్మీర్‌ లోయ ప్రాంతం భారత్‌తో రైలు మార్గాన అనుసంధానమై లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు గరిష్టంగా సంగల్దాన్‌–బారాముల్లా సెక్షన్‌ దాకా మాత్రమే రాగలవు. సుదూర సర్వీస్‌ రైళ్లు అయితే కట్రా వరకే రాగలవు. తాజా విస్తరణతో కశ్మీర్‌ లోయ ప్రాంతవాసులు కూడా తొలిసారిగా రైలు సేవలను అందుకోనున్నారు.
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)