Breaking News

నేడు మణిపూర్‌లో ప్రధాని పర్యటన 

Published on Sat, 09/13/2025 - 05:48

ఇంఫాల్‌:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్‌లో అడుగుపెడుతుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారని, రూ.7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్‌కుమార్‌ గోయల్‌ శుక్రవారం తెలిపారు. 

చురాచాంద్‌పూర్, ఇంఫాల్‌లో ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో మోదీ సమావేశమవుతారని వెల్లడించారు. రెండు ర్యాలీల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. మోదీ పర్యటన అనంతరం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ప్రగతి వేగవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మణిపూర్‌ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నట్లు ఆయన కార్యాలయం స్పష్టంచేసింది. 

మణిపూర్‌లో నరేంద్ర మోదీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, సివిల్‌ సెక్రటేరియట్‌ను ప్రారంభించబోతున్నారు. అలాగే మణిపూర్‌ ఇన్ఫోటెక్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మణిపూర్‌ కేవలం సరిహద్దు రాష్ట్రం కాదని.. యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీకి ఒక మూలస్తంభమని, సౌత్‌ఈస్ట్‌ ఆసియాకు ముఖద్వారమని పునీత్‌కుమార్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకాలని, ఆయన నిర్వహించే సభల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.   

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)