Breaking News

విదేశీ పర్యటనకు మోదీ

Published on Thu, 07/24/2025 - 06:42

న్యూఢిల్లీ:  ప్రధాని మోదీ బుధ వారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన నాలుగు రోజులపాటు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), మాల్దీవుల్లో పర్యటిస్తారు. తన పర్యటనతో ఆయా దేశాలతో మన దేశానికి సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మోదీ ఈ మేరకు సందేశం విడుదల చేశారు. 

భారత్‌–యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని, ఇరుదేశాల మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు మెరుగయ్యాయని వెల్లడించారు. కీలక రంగాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. యూకే ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఉద్ఘాటించారు.  మోదీ యూకే పర్యటనలో కింగ్‌ చార్లెస్‌–3 సైతం కలుసుకుంటారు. యూకే అనంతరం ఆయన మాల్దీవులకు చేరుకుంటారు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి కంటే ముందు ఆయనతో మంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని మోదీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.  

ఎఫ్‌టీఏతో భారత్‌కు తీవ్ర నష్టం
భారత్‌–యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తో మన దేశానికి భారీ నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు. యూకే మేలు చేసేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ఎఫ్‌టీఏపై దేశ ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌టీఏ కారణంగా భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) తీవ్రంగా నష్టపోతాయని స్పష్టంచేశారు. ఆటోమొబైల్, ఫార్మా స్యూటికలు రంగాలు సైతం నష్టపోతాయన్నారు. యూకే నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై సుంకాలను 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడాన్ని జైరామ్‌ రమేశ్‌ తప్పుపట్టారు.

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)