Breaking News

‘ఆప్‌’ను ప్రజలు క్షమించరు 

Published on Thu, 01/30/2025 - 01:49

న్యూఢిల్లీ:  యమున నదిలో విషం కలుపుతున్నారంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)చేసిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఓటమి తప్పదని తేలడంతో ఆప్‌ నాయకులు మతితప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని కర్తార్‌ నగర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

ఆప్‌ నాయకులకు, చార్లెస్‌ శోభారాజ్‌కు మధ్య పెద్ద తేడా లేదని అన్నారు. పైకి అమాయకంగా కనిపిస్తూ ప్రజల సొమ్మును దోచుకోవడంలో వారు ఆరితేరిపోయారని దుయ్యబట్టారు. ‘‘వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినవారు, అద్దాల మేడల్లో నివసిస్తున్నవారు పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఓటమి భయంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 

ఢిల్లీలో యుమున నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పుడు దగాకోరు మాటలు చెబుతోంది. యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇస్తే ఓట్లు రావని అంటోంది. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు దొరకడం ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఇష్టంలేదు. ఢిల్లీలోని పూర్వాంచల్‌ ప్రజలు మురికికూపంలోనే ఛాత్‌ పూజలు చేసుకోవాలని కోరుకుంటోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశ చరిత్రలో అతిపెద్ద పాపం చేసింది. ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మాజీ ముఖ్యమంత్రి(అరవింద్‌ కేజ్రీవాల్‌) హరియాణా ప్రజలపై నిందలు వేశారు.

యమునా నదిలో విషం కలిపారని అన్నారు. హరియాణాలో ఉన్నది మనుషులు కాదా? వారికి ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధువులు లేరా? సొంత మనుషులు చావాలని నదిలో విషం కలుపుతారా? యమున నదిలో హరియాణా నుంచి వస్తున్న నీటినే నాతోపాటు ఢిల్లీ ప్రజలు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు కూడా తాగుతున్నారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నదిలో విషం కలిపి నాకు హాని కలిగిస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఆప్‌ నాయకులు అసలేం మాట్లాడుతున్నారు? తప్పులను క్షమించే గుణం మన భారతీయుల్లో ఉంది. కానీ, ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తే ఎవరూ క్షమించరు. ఆప్‌ పాపాత్ములను  మన్నించే ప్రసక్తే లేదు’’అని  మోదీ అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)