రైతు సంక్షేమమే లక్ష్యం: ప్రధాని మోదీ

Published on Thu, 02/22/2024 - 12:37

దేశంలోని రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చెరకు కొనుగోలు ధరల పెంపుదలకు కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించిన నేపధ్యంలో మోదీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ పెంపుదలతో  కోట్లాది మంది  చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

చక్కెర సీజన్ 2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) కోసం చక్కెర మిల్లులు చెల్లించాల్సిన చెరకు ‘న్యాయమైన, లాభదాయక ధర’ (ఈఆర్‌పీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో చెరకు ఎఫ్‌ఆర్‌పి క్వింటాల్‌కు రూ. 340 ప్రాథమిక రికవరీ రేటు 10.25 శాతంగా నిర్ణయించారు. 10.25% కంటే ఎక్కువ రికవరీలో ప్రతి 0.1% పెరుగుదలకు, క్వింటాల్‌కు రూ. 3.32 ప్రీమియం అందించనున్నారు. ఇదేకాకుండా 9.5 శాతం లేదా అంతకంటే తక్కువ రికవరీ కలిగిన చక్కెర మిల్లులకు ఎఫ్‌ఆర్‌పి క్వింటాల్‌కు రూ.315.10గా నిర్ణయించారు. కొత్త రేట్లు 2024, అక్టోబర్ 1 నుండి వర్తించనున్నాయి.


 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ కొత్త రేట్లకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు ఎఫ్‌ఆర్‌పి కంటే ఇది 8 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఐదు కోట్ల మందికి పైగా చెరకు రైతులకు లబ్ధి  చేకూరనుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)