Breaking News

మారిషస్‌కు రూ.6,004 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

Published on Fri, 09/12/2025 - 05:24

వారణాసి:  మారిషస్‌కు 680 మిలియన్‌ డాలర్ల(రూ.6,004 కోట్లు) ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్‌ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూలామ్‌ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సమావేశమయ్యారు. భారత్‌– మారిషస్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 

ఈ సందర్భంగా వి ద్య, ఇంధనం, హైడ్రోగ్రఫీ, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్, మారిషస్‌లు కేవలం భాగస్వామ్య పక్షాలు మా త్రమే కాదని.. అవి ఒకే కుటుంబమని నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. 

స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన, స్థిరమైన, సౌభాగ్యవంతమైన హిందూ మహాసముద్రం ఇరుదేశాలకు ఉమ్మడి ప్రాధాన్యం కలిగిన అంశమని వివరించారు. నవీన్‌చంద్రతో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. మారిషస్‌ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతను బలోపేతం చేయడానికి భారత్‌ కట్టుబడి ఉందన్నారు. మారిషస్‌లో యూపీఐ చెల్లింపులు, రూపేకార్డులు అందుబాటులోకి వచ్చాయని, ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీల్లోనే జరి గేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.  

మారిషస్‌లో ‘మిషన్‌ కర్మయోగి’ 
ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద మారిషస్‌లో 10 ప్రాజెక్టులకు భారత్‌ సాయం అందించబోతోంది. ఇందులో ఓడరేవు, ఎయిర్‌పోర్టు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇది ఆర్థిక సాయం కాదని.. రెండు దేశాల ఉమ్మడి భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్, మారిషస్‌లు రెండు వేర్వేరు దేశాలు అయినప్పటికీ వాటి స్వప్నాలు, భవిష్యత్తు ఒక్కటేనని స్పష్టంచేశారు.

 చాగోస్‌ ఒప్పందం కుదిరినందుకు నవీన్‌ చంద్రతోపాటు మారిషస్‌ ప్రజలకు మోదీ అభినందనలు తెలిపారు. మారిషస్‌ సార్వభౌమత్వానికి ఇదొక చరిత్రాత్మక విజయమని ఉద్ఘాటించారు. మారిషస్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. మారిషస్‌ సార్వ¿ౌమత్వాన్ని పూర్తిస్థాయిలో గుర్తించడానికి తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని తెలిపారు. మారిషస్‌లో నూతన డైరెక్టరేట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. 

మారిషస్‌లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి త్వరలో ‘మిషన్‌ కర్మయోగి’ప్రారంభిస్తామన్నారు. పరిశోధన, విద్య, నవీన ఆవిష్కరణల్లో భారత్, మారిషస్‌ల భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమని స్పష్టంచేశారు. చాగోస్‌ దీవులను మారిషస్‌కు అప్పగించేందుకు ఈ ఏడాది మే నెలలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ దీవులపై హక్కులను యూకే వదులుకుంది. ఇదిలా ఉండగా, మారిషస్‌ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర ఈ నెల 16 దాకా భారత్‌లో పర్యటించనున్నారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)