Breaking News

సీఐసీ ఎంపికపై... రాహుల్‌ అసమ్మతి 

Published on Thu, 12/11/2025 - 05:15

న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని త్రిసభ్య కమిటీ బుధవారం ఢిల్లీలో భేటీ అయింది. సీఐసీతో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్ల పేర్లను ఖరారు కూడా ఈ భేటీలో చేసినట్టు సమాచారం. అయితే ఈ పేర్లను కమిటీ సభ్యుడైన విపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యతిరేకించారు. ఈ మేరకు తన అసమ్మతితో లేఖ కూడా సమర్పించారు. 

అభ్యర్థులకు సంబంధించి రాహుల్‌ మరిన్ని వివరాలు కోరినట్టు సమాచారం. వారి ఎంపికకు అనుసరించిన ప్రాతిపదికను కూడా ఆయన ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భేటీలో కమిటీ సభ్యుడైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా పాల్గొన్నారు. సమాచార హక్కు చట్ట సంబంధిత వివాదాల పరిష్కారానికి అంటున్న అపెలెట్‌ విభాగమైన సీఐసీలో ప్రస్తుతమిద్దరే కమిషనర్లున్నారు. సీఐసీతో పాటు 8 ఖాళీలున్నాయి. ఈ విషయమై సుప్రీంకోర్టు పదేపదే కేంద్రానికి తలంటిన నేపథ్యంలో ఖాకీల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. సీఐసీ పదవి కోసం 81 మంది, కమిషనర్‌ పోస్టులకు 161 మంది దరఖాస్తు చేసుకున్నారు.  
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి