Breaking News

యూపీ కుర్రాడికి ప్రధాని మోదీ ఎందుకు లేఖ రాశారు?

Published on Sat, 05/25/2024 - 08:40

ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే అవసరమైనప్పుడు కొందరికి లేఖలు కూడా రాస్తుంటారు. తాజాగా యూపీలోని ఒక యువకునికి ప్రధాని మోదీ లేఖరాశారు.

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని మొహల్లా పిర్బతవాన్‌లో నివసిస్తున్న అభయ్ చంద్వాసియాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అభయ్‌ను ప్రశంసించారు. అభయ్ గత 20 ఏళ్లుగా  మోటార్ న్యూరాన్ డిజార్డర్ అనే నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం 95 శాతం మేర శారీరక వైకల్యంతో జీవిస్తున్నాడు.

ప్రధాని మోదీ తన లేఖలో అభయ్ చంద్వాసియాను ప్రశంసించారు. ‘ప్రేమతో కూడిన మీ మాటలు దేశం కోసం మనస్పూర్తిగా పని చేసేవారికి కొత్త శక్తిని ఇస్తాయని మోదీ పేర్కొన్నారు. అభయ్ తన స్వీయ రచనలోని  ప్రతి పదాన్ని ప్రధాని మోదీకి అంకితం చేశారు. శారీరక వైకల్యంతో మంచం మీదనే ఉంటున్నప్పటికీ అభయ్‌  పలు స్ఫూర్తిదాయకమైన రచనలు సాగించాడు.  అవి చదివినవారు వీటిని రాసిన వ్యక్తి శారీరక వైకల్యంతో బాధపడుతూ, కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైనవాడంటే ఎవరూ నమ్మలేరు.

ప్రధాని నరేంద్ర మోదీపై అభయ్‌కు ఎనలేని అభిమానం. ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, దేశ ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి, నాయకత్వ సామర్థ్యాలను వర్ణిస్తూ కవిత్వం రాశాడు. దీనికి స్పందించిన ప్రధాని మోదీ అభయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని నుంచి లేఖ రావడంపై అభయ్ ఆనందం వ్యక్తం చేశారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)