మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
ఏపీ ప్రజలది అసాధారణమైన ప్రతిభ: ప్రధాని మోదీ
Published on Wed, 11/01/2023 - 10:01
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారాయన.
ఏపీ ప్రజలు చైతన్యవంతులంటూ ట్వీట్ చేశారాయన. అంతేకాదు అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం, దృఢమైన పట్టుదల ఇక్కడి ప్రజల సొంతమంటూ ప్రధాని తన సందేశంలో కొనియాడారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం, విజయం కోసం నిరంతరం తాను ప్రార్థిస్తానంటూ ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభసందర్భంగా, ఈ చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేశారు. వారి నిరంతర శ్రేయస్సు మరియు విజయం కోసం నేను…
— Narendra Modi (@narendramodi) November 1, 2023
ఇదీ చదవండి: రాష్ట్ర అవతరణ దినోత్సవం.. వైఎస్సార్ అవార్డుల ప్రదానం నేడు
Tags : 1