Breaking News

నేవీకి నూతన శక్తి 

Published on Sat, 06/20/2026 - 04:15

కోల్‌కతా:  స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు కీలక నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత నౌకా దళంలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారని అధికార వర్గాలు తెలియజేశాయి. పశ్చిమ బెంగాల్‌లోని శ్యామప్రసాద్‌ ముఖర్జీ ఓడరేవులో ఈ కార్యక్రమం జరుగుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్‌ సర్వే, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం వంటి కార్యాచరణల కోసం ఈ నౌకలను నిర్మించినట్లు తెలిపాయి. 

ఈ మూడు నౌకలకు దునగిరి, సంశోధక్, అగ్రయ్‌ అని పేరుపెట్టారు. భారత నావికాదళానికి చెందిన వార్‌íÙప్‌ డిజైన్‌ బ్యూరో వీటిని డిజైన్‌ చేసింది. కోల్‌కతాలోని రక్షణ రంగ సంస్థ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ) లిమిటెడ్‌ నిర్మించింది. దునగిరి నౌకలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు అమర్చారు. ఇందులో బ్రిహ్మోస్‌ క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ నౌకతో భారత నౌకాదళం పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. 

సంశోధక్‌ అనే సర్వే నౌకను తీరప్రాంత, లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల కోసం, సముద్ర శాస్త్ర, భూ¿ౌతిక డేటాను సేకరించడానికి రూపొందించారు. ఇక అగ్రయ్‌ అనేది అర్నాల తరగతికి చెందిన ఒక జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక. తీరప్రాంత జలాల్లో నీటి అడుగున ఉన్న ముప్పును గుర్తించి, ఎదుర్కోవడానికి తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్‌ లాంచర్లు, జల సోనార్‌ వ్యవస్థలు అమర్చారు. ఈ మూడు నౌకల్లో 75 శాతానికి పైగా స్వదేశీ కంటెంట్‌ ఉందని, వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్‌ఎంఈలు పాలుపంచుకున్నాయని అధికార వర్గాలు చెప్పాయి.  

నేడు, రేపు ఒడిశా, బెంగాల్‌లో మోదీ పర్యటన  
న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీ శనివారం, ఆదివారం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద రైతుల ఖాతాల్లో 23వ విడత నిధులు జమచేస్తారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్లమంది బ్యాంకు ఖాతాల్లోకి 18,800 కోట్లు బదిలీ చేయబోతున్నారు. 

శనివారం ఒడిశా రాష్ట్రంలో మయూర్‌భంజ్‌లోని పవిత్ర క్షేత్రాలైన సంథాలి జహెరా, హో జహెరాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ప్రార్థనల్లో పాల్గొంటారు. అలాగే బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో ‘పశ్చిమ బంగ దివస్‌’వేడుకలకు హాజరవుతారు. ఆదివారం ఉదయం కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పలు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫామింగ్, ప్రధానమంత్రి ధన్‌–ధాన్య కృషి యోజనను ప్రారంభిస్తారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)