రెండు రోజుల లావోస్‌ పర్యటనకు ‍ప్రధాని మోదీ

Published on Thu, 10/10/2024 - 10:33

న్యూఢిల్లీ: 21వ ఆసియాన్-ఇండియా, 19వ తూర్పు ఆసియా సదస్సులలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లావోస్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ లావోస్ పర్యటన ఆసియాన్ దేశాలతో భారత్‌ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.

పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ లావోస్‌తో భారతదేశానికి సన్నిహిత సాంస్కృతిక, నాగరికత సంబంధాలు ఉన్నాయని ప్రధాని అన్నారు. లావోస్‌ ప్రధాని సోనెక్సా సిఫనాడోన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం వియంటియాన్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ తూర్పు ఆసియా సదస్సులలో ప్రధాని పాల్గొంటారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైదీప్ మజుందార్ మాట్లాడుతూ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరుకావడం ఇది 10వ సారని తెలిపారు. ప్రధాని మోదీ, సిపాండన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉంటుందని మజుందార్ తెలిపారు. సాంస్కృతిక ప్రదేశాల పునరుద్ధరణ,  విద్యుత్ ప్రాజెక్టులు తదితర అనేక  అంశాలపై చర్చజరగనున్నదని తెలిపారు. మయన్మార్‌లో కొనసాగుతున్న సంఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటలో చర్చించనున్నారని మజుందార్‌ తెలిపారు.
 

ఇది కూడా చదవండి: డాలస్‌లో ఘనంగా 'గాంధీ శాంతి నడక-2024'

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)