Breaking News

ఆఖరి వ్యక్తికి సైతం సంక్షేమ పథకాలు

Published on Sun, 06/29/2025 - 03:29

న్యూఢిల్లీ:  ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత, సజీవ సంస్కృతి మన సొంతమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎందరో యోగులు, గురువులు, ఆచార్యులు, సాధువులు అందించిన మన ఆలోచనలు, ఆశయాలు, తాతి్వకత శాశ్వతమని, అందుకే భరతజాతి వేలాది సంవత్సరాలుగా సజీవంగా మనగలుగుతోందని వివరించారు.

 ప్రఖ్యాత జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీవిద్యానంద్‌జీ మహారాజ్‌ శత జయంతి వేడుకలు, ఏడాదిపాటు జరిగే శతాబ్ది ఉత్సవాలు శనివారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ, భగవాన్‌ మహావీర్‌ అహింసా భారతి ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పాల్గొన్నారు. ఆచార్య స్మారకార్థం తపాలా బిళ్ల ఆవిష్కరించారు. 

ఆచార్యుడి జీవిత విశేషాలతో కూడిన ఎగ్జిబిషన్‌ తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కార్యక్రమ నిర్వాహకులు ‘ధర్మ చక్రవర్తి’ బిరుదు ప్రదానం చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ బిరుదుకు తాను అర్హుడినని భావించడం లేదని చెప్పారు. కానీ, గురువులు, యోగుల నుంచి ఏదీ లభించినా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం మన సంప్రదాయం, సంస్కృతిలో భాగమని తెలిపారు. అందుకే ‘ధర్మ చక్రవర్తి’ ప్రసాదాన్ని స్వీకరించి, భరతమాతకు అంకితం ఇస్తున్నానని ఉద్ఘాటించారు.  

మానవ జన్మకు అసలైన పరమార్థం అదే  
భారతీయ తాతి్వక చింతనకు సేవ, మానవత్వం మూల స్తంభాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. హింసను హింసతోనే అణచివేసే ధోరణి ప్రపంచంలో కొనసాగిందని, కానీ, మన దేశం అహింస అనే ఆయుధం అందించిందని చెప్పారు. మానవ సేవే మహోన్నతం అని మన దేశం బోధించినట్లు తెలిపారు. షరతులు లేకుండా, నిస్వార్థంగా సాటి మానవులకు సేవ చేయడమే మానవ జన్మకు అసలైన పరమార్థమని వివరించారు.

 తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అచార్య శ్రీవిద్యానంద్‌జీ మహారాజ్‌ ఆశయాలు, బోధనలే స్ఫూర్తి అని తెలిపారు. పీఎం ఆవాస్‌ యోజన, జల్‌జీవన్‌ మిషన్, ఆయుష్మాన్‌ భారత్‌ యోజన వంటి పథకాలను సంతృప్త స్థాయిలో అందించాలని నిర్ణయించామని చెప్పారు. సమాజంలో ఆఖరి వ్యక్తికి సైతం ఈ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ‘ప్రజలంతా కలిసి పని చేయాలి.. కలిసికట్టుగా ఎదగాలి’ అని ఆచార్య విద్యానంద్‌జీ మహారాజ్‌ బోధించారని, అదే తమ సంకల్పమని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)