Breaking News

ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ చర్చలు

Published on Wed, 10/23/2024 - 16:29

కజన్‌: బ్రిక్స్‌  సమావేశాల సైడ్‌లైన్స్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రష్యాలో బుధవారం(అక్టోబర్‌ 23) సమావేశమయ్యారు. వీరిద్దరూ ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది కీలకలంగా మారింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

భారత్‌, చైనా వాస్తవాధీన రేఖపై పెట్రోలింగ్‌ నిర్వహించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిన్‌పింగ్‌,మోదీ భేటీ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020లో సరిహద్దులో జరిగిన భారత, చైనా సైనికుల ఘర్షణల తర్వాత చైనా,భారత్‌ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. 

ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదు: మోదీ 

బ్రిక్స్‌ రెండో రోజు సమావేశాల్లో బుధవారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. సమావేశాలను పుతిన్‌ విజయవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. భవిష్యత్తులో బ్రిక్స్‌ మరింత పటిష్టమైన వేదిక అవుతుందన్నారు. బ్రిక్స్‌ చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్‌ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు.

 ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టామని చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదన్నారు. బ్రిక్స్‌ దేశాలు లోకల్‌ కరెన్సీ ద్వారా వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహించాలని కోరారు.  

ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం అసహనం

 

 

 

 

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)