Breaking News

మీ అభివృద్ధిలో భారత్‌ విశ్వసనీయ భాగస్వామి

Published on Wed, 10/15/2025 - 01:31

న్యూఢిల్లీ: మంగోలియా దేశాభివృద్ధిలో భారత్‌ విశ్వసనీయ భాగస్వామి పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నాలుగురోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నా(Khurelsukh Ukhnaa) ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉఖ్నా భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇరువురి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, మంగోలియా బంధం కేవలం ద్వైపాక్షికం కాదు. అంతకుమించిన గాఢమైన, ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధం. మన ఇరుదేశాల భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజల సత్సంబంధాల్లో ప్రతిబింబిస్తోంది.

భారత్‌ అందించిన 1.7 బిలియన్‌ డాలర్ల ఆర్థికసాయంతో మంగోలియాలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్‌ ఆ దేశ ఇంధన రక్షణకు మరింత భద్రత చేకూరుస్తుంది. విదేశాల్లో భారత్‌ చేపట్టిన అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్ట్‌ ఇదే. ఇందులో మంగోలియా సిబ్బందితోపాటు 2,500 మందికిపైగా భారతీయ నిపుణులు పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను సుసాధ్యం చేస్తున్నారు. ఇది మాత్రమేకాకుండా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇండో–పసిఫిక్‌లో స్వేచ్ఛా, సులభతర, సమగ్రత వాణిజ్యానికి ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. గ్లోబల్‌ సౌత్‌ వాణిని గట్టిగా ఇరుదేశాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మంగోలియా పౌరులకు భారత్‌ ఉచితంగా ఈ–వీసాలను అందించనుంది’’ అని మోదీ చెప్పారు. 

పలు రంగాల్లో పరస్పర సహకారం
ఈ సందర్భంగా ఉఖ్నా భారత్‌ను పొగిడారు. ‘‘స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్‌ అద్భుతంగా నాయకత్వ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సౌరకూటమిలోనూ భారత్‌ తనదైన కీలక భూమిక పోషిస్తోంది’’ అని శ్లాఘించారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘బౌద్ధమతం విషయంలో ఇరుదేశాలు తోబుట్టువులే. గౌతమ బుద్దుడి ముఖ్య శిష్యులైన సరిపుత్ర, మౌద్గల్యయానల పవిత్ర అవశేషాలు వచ్చే ఏడాది మంగోలియాకు భారత్‌ అప్పగించనుంది. గందన్‌ బౌద్ధారామానికి భారత్‌ త్వరలో ఒక సాంస్కృతిక ఉపాధ్యాయుడిని పంపనుంది. ఆయన అక్కడి బౌద్ధ ప్రాచీన ప్రతులను అధ్యయనం చేయనున్నారు.

మంగోలియాలో బౌద్ధమత వ్యాప్తికి నాటి బిహార్‌లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం ఎంతగానో సాయపడింది. ఇప్పుడు అదే రీతిలో గందన్‌ మఠం, నలంద వర్సిటీల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాం ’’అని మోదీ చెప్పారు. ‘‘లద్దాఖ్‌ స్వయంప్రతిపత్తి పర్వతప్రాంత అభివృద్ధి మండలి, మంగోలియాలోని అర్ఖాంగాయ్‌ ప్రావిన్స్‌ల మధ్య సాంస్కృతిక బంధం బలపడేందుకు మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. రక్షణ మొదలు భద్రత, ఇంధనం, గనులు, సమాచార సాంకేతికత, విద్య, ఆరోగ్యం, సంస్కృతిక సహకార రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం, పరస్పర సహకారం మరింత బలపడింది’’ అని మోదీ అన్నారు. 1955లో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలయ్యాయి. 

#

Tags : 1

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)