Breaking News

బుద్ధుడిపై వియత్నాం ప్రజల్లో భక్తి, ఆప్యాయత ఉన్నాయి

Published on Mon, 06/30/2025 - 05:20

సాక్షి, న్యూఢిల్లీ/విజయపురి సౌత్‌: ప్రపంచ పర్యాటక బౌద్ధ కేంద్రమైన నాగార్జునకొండలోని భగవాన్‌ బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కలి్పంచినందుకు వియత్నాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సందేశాల ద్వారా కృతజ్ఞతలు చెబుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మొదట భగవాన్‌ బుద్ధుని పవిత్ర అవశేషాలు రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నాగార్జున కొండలో కనుగొన్నట్టు తెలిపారు.

ఈ ప్రదేశానికి బౌద్ధ మతంతో లోతైన సంబంధం ఉందన్నారు. ఒకప్పుడు శ్రీలంక, చైనా వంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి సందర్శించే వారని మోదీ వివరించారు. ఆదివారం జరిగిన మన్‌ కీ బాత్‌ 123వ ఎపిసోడ్‌లో మోదీ ప్రసంగించారు. వియత్నాం ప్రజలు పంపించిన సందేశాలలో ప్రతి పంక్తిలో భక్తి, ఆప్యాయత ఉన్నాయన్నారు. బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించినందుకు వారు భారతదేశానికి తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.  

ఆదివాసీ విద్యార్థులు భేష్‌ 
‘పదేళ్ల క్రితం ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం గొప్పగా మారుతోంది. విశాఖపట్నంలో జరిగిన యోగా దినోత్సవంలో చాలా ఆకర్షణీయమైన చిత్రాలను మనం చూశాం. బీచ్‌లో 3 లక్షల మంది యోగా చేయడం.. యోగాపై వారికున్న అంకితభావాన్ని గుర్తు చేస్తోంది’ అని మన్‌ కీ బాత్‌లో మోదీ గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం జ్ఞాపకాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘విశాఖ నుంచే మరో అద్భుతమైన దృశ్యం వెలువడింది. రెండు వేలకు పైగా ఆదివాసీ విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. వారికి యోగాపై ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉందో మీరే ఊహించుకోండి. మన నావికాదళ నౌకలపై కూడా యోగా గొప్పతనం కనిపించింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)