Breaking News

ఎనిమిది కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా

Published on Sat, 08/10/2024 - 03:27

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఆత్మ నిర్భర్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా ఎనిమిది నూతన రైల్వేలైన్‌ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సుమారు రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఎనిమిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్‌ కేబినెట్‌ సమావేశానంతరం మీడియాకు ఆ వివ రాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులన్నీ 2030–31 కల్లా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

⇒ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహా రాష్ట్ర, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రా ల్లోని 14 జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్టుల నిర్మా ణం జరుగుతుంది. అందులో భాగంగానే కొత్తగా 64 రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం, మల్కన్‌గిరితోపాటు ఆరు ఆకాంక్ష జిల్లాల్లోని 510 గ్రామాలతోపాటు దాదాపు 40 లక్షల మంది జనాభాకు రైల్‌ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.  

⇒ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి మల్క న్‌గిరి–పాండురంగాపురం (భద్రాచలం మీదుగా) 173.61 కి.మీ పొడవున నూతన రైల్వేలైన్‌ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాతోపాటు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలు ఉన్నాయి.  ప్రముఖ పుణ్య క్షేత్రమైన భద్రాచలాన్ని ప్రధాన రైల్వేలైన్‌తో అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడనుంది. వీటితోపాటు తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన అజంతా గుహలను రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా...
మల్కన్‌గిరి నుంచి పాండురంగాపురం వరకు  గత ఏడాది ఫైనల్‌ లొకేషన్స్‌ సర్వే మంజూరైంది. ఆ వెంటనే సర్వే పనులు పూర్తి చేయడంతో కేంద్ర ప్రభు త్వం ఇప్పుడు ఆ మార్గాన్ని నిర్మించేందుకు సిద్ధప డింది. ఈ కొత్త రైల్వేలైన్‌ వల్ల భద్రాద్రి కొత్తగూడెంలోని రైలు అనుసంధానం లేని కొత్త ప్రాంతాలకు రైల్వే వసతి ఏర్పడుతుంది. సరుకు రవాణా ప్రధాన లక్ష్యంగానే ఇది నిర్మిస్తున్నప్పటికీ ప్రయాణికుల రైలు కూడా దీని మీదుగా నడపనున్నట్టు అధికా రులు చెబుతున్నారు. ఇందుకు దాదాపు రూ. 3,592 కోట్లు ఖర్చు చేయబోతోంది.

జునాగఢ్‌ నుంచి మల్కన్‌గరి, మల్కన్‌గిరి నుంచి  పాండురంగాపురం వరకు... ఈ రెండు లైన్లు కలిపి చూస్తే అయ్యే వ్యయం రూ.7,383 కోట్లు. ఈ ప్రాజెక్టు కోసం 1697 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. సెంట్రల్‌ సౌత్‌ ఇండియాలోని పవర్‌ ప్లాంట్లకు మహానది కోల్డ్‌ఫీల్డ్‌కు ఇది దగ్గర దారి కాబోతోంది. బస్తర్‌  రీజియన్‌కు మధ్య 124 కిలోమీటర్ల దూరాభారాన్ని కూడా ఇది తగ్గించనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)