Breaking News

ఉపాధికి వరం ‘మహీంద్రా ఐటీఐ’.. ప్రారంభించిన ప్రధాని మోదీ

Published on Thu, 10/09/2025 - 11:30

ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మహీంద్రా ట్రాక్టర్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని వర్చువల్‌గా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కేంద్రం గ్రామీణ యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలలో శిక్షణ అందించడం, వారి నూతన అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.  మహీంద్రా ట్రాక్టర్స్ వృత్తి విద్య, శిక్షణ విభాగం (డీవీఈటీ).. మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంఘం (ఎంఎస్‌ఎస్‌డీఎస్‌) భాగస్వామ్యంతో గడ్చిరోలిలోని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్సిట్యూట్ (ఐటీఐ) కళాశాలలో ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది.

గడ్చిరోలిలో ఏర్పాటు చేసిన ఈ ట్రాక్టర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా మహీంద్రా సంస్థ ట్రాక్టర్, తరహా వ్యవసాయ యంత్రాల వినియోగంలో యువతకు నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇందుకోసం అత్యుత్తమ నిపుణుల సేవలను వినియోగించుకోనుంది. ఈ కేంద్రం బహుళ కెరీర్ అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ సందర్భంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడ్చిరోలిలో మహీంద్రా ట్రాక్టర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినందుకు  ఎంతో సంతోషిస్తున్నాం. మహారాష్ట్ర కేవలం ఒక ప్రముఖ పారిశ్రామిక కేంద్రం మాత్రమే కాదు.. వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం.  గ్రామీణ యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకోవడం మాకు గర్వకారణం’ అని అన్నారు.

1963లో స్థాపితమైన మహీంద్రా ట్రాక్టర్స్  నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలో నంబర్ వన్‌ ట్రాక్టర్ బ్రాండ్‌గా నిలిచింది. ఇటీవల 50కిపైగా దేశాలలో నాలుగు మిలియన్ ట్రాక్టర్లను విక్రయించి, మరో మైలురాయిని దాటింది. మహీంద్రా ట్రాక్టర్స్ మన్నిక, పనితీరు, విశ్వసనీయతకు పేరొందింది. ఈ ట్రాక్టర్లు వ్యవసాయ పనులకు అత్యుత్తమంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. నాణ్యత, తయారీ ప్రమాణాలలో అత్యుత్తమ ప్రతిభకు డెమింగ్ అవార్డును మహీంద్రా ట్రాక్టర్స్ అందుకుంది. 300కు మించిన  ట్రాక్టర్ మోడళ్లతో, స్థిరమైన అమ్మకాలు కలిగి, అంతర్జాతీయంగానూ మహీంద్రా ట్రాక్టర్స్‌ పేరుగాంచింది. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)