Breaking News

పండుగలను ఇక్కడే జరుపుకోండి

Published on Mon, 08/11/2025 - 11:49

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్ల సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలను నివాస ప్రాంగణాల్లోనే జరుపుకోవాలని, అదే సమయంలో పరిశుభ్రత విషయంలో పోటీ పడాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రజలను ఐక్యంగా ఉంచుతున్న వేర్వేరు నదుల పేర్లను నాలుగు టవర్లకు పెట్టామని ఆయన చెప్పారు. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఒక టవర్‌కు కోసి నది పేరును పెట్టామంటూ కొందరు అల్పబుద్ధితో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. లక్షలాది మందికి జీవం పోసే ఈ నదులు ఇప్పుడు ప్రజా ప్రతినిధుల జీవితాల్లో కొత్త ఆనందాలకు ప్రేరణగా నిలుస్తా యి’అని ఆయన అన్నారు. ఢిల్లీలోని బాబా ఖడక్‌ సింగ్‌ మార్గ్‌లో పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌కు సమీపంలో నిర్మించిన మరో మూడు టవర్లకు కృష్ణా, గోదావరి, హూగ్లీ నదుల పేర్లను పెట్టారు. 

కాంప్లెక్స్‌లో మొత్తం 184 ఫ్లాట్లు న్నాయి. అత్యా« దునిక వసతులు, పక్కాగా భద్రతా ఏర్పాట్లను కల్పించారు. ఎంపీలకు ఇళ్ల కొరత ఇబ్బందిగా మారిందని, మొదటిసారి ఎంపీలైన వారికి ఇల్లు దొరకడమే కష్టంగా మారిందని ప్రధాని ఫ్లాట్ల ప్రారంభం సందర్భంగా తెలిపారు. 2004–2014 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎంపీలకు కొత్తగా నివాసాలను నిర్మించనే లేదని ఆయన పేర్కొ న్నారు. పాతబడిన భవనాల్లో ఎంపీలు పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా రు. తాము అధికారంలోకి వచ్చాక 350 ఫ్లాట్లను ఎంపీల కోసం నిర్మించామని చెప్పారు. ఇక మునుపటి ఇబ్బందులేవీ ఉండవని హామీ ఇచ్చారు. తాజాగా నిర్మించిన ఫ్లాట్లు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలంగా ఉన్నాయని వివరించారు. 

వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ఎంపీలు ఈ ప్రాంగణాల్లో బస చేస్తారని.. ఇది ’ఏక్‌ భారత్‌– శ్రేష్ఠ భారత్‌’ ఆలోచనకు ప్రతీక అని అన్నారు. వివిధ రాష్ట్రాల పండుగలను సమష్టిగా ఇక్కడ జరుపుకోవడం గొప్ప అనుభూతినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఎంపీలు తమ నియోజ కవర్గ ప్రజలను కూడా వేడుకల్లో భాగస్వాములుగా చేసుకోవచ్చన్నారు. 

ఇక్కడుండే ఎంపీలు, పరి శుభ్రతను తమ కర్తవ్యంగా భావించాలని, ఈ విష యంలో ఏటా రెండుమూడు పర్యాయాలు పోటీలు పెడితే బాగుంటుందని సంబంధిత శాఖను, కమిటీ లను కోరుతానని తెలిపారు. ఈ పోటీలో పరిశు భ్రతలో అత్యుత్తమైన బ్లాక్‌ పేరును ప్రకటిస్తా రన్నారు. మరో ఏడాది తర్వాత, ఉత్తమ బ్లాక్, చెత్తగా ఉండే బ్లాకులను నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. సముదాయం ఆవరణలో అనంతరం ప్రధాని మోదీ సిందూరం మొక్కను నాటారు. భవన నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఇంజనీరింగ్‌ అధికారులు, ఇతర సిబ్బందితో ముచ్చటించారు. వారి కృషిని కొనియాడారు.  

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)