Breaking News

2014 తర్వాతే సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది: ప్రధాని మోదీ

Published on Mon, 04/03/2023 - 11:48

ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా(CBI) తాజాగా అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో..  డైమండ్‌ జూబ్లీ వేడుకలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.  న్యూఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

సీబీఐ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు షిల్లాంగ్‌, పూణే, నాగ్‌పూర్‌లలో కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఐ కాంప్లెక్స్‌లను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ప్రెసిడెంట్స్‌ పోలీస్‌ మెడల్‌తో పాటు  ఉత్తమ దర్యాప్తు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే.. డైమండ్ జూబ్లీ ఉత్సవాల స్మారకార్ధం పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు. 

ఈ కార్యక్రమంలోనే సీబీఐ కొత్త ట్విటర్‌ హ్యాండిల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘సీబీఐ పరిధి పెరిగింది. చాలా నగరాల్లో సీబీఐ ఆఫీసులు నెలకొల్పుతున్నాం. అవినీతి సాధారణ నేరం కాదు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు. అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు. 2014లో మేము అవినీతిపై యుద్ధం ప్రారంభించాము. 2014 తర్వాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది. అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర. ఇప్పుడు అవినీతిపరులు భయపడుతున్నారు. గత ప్రభుత్వాలు అవినీతిని వ్యవస్థీకృతం చేశాయి. ఒక కుంభకోణానికి మించి మరో కుంభకోణం చేశాయి. 2జీ స్కామ్‌ అతిపెద్ద కుంభకోణం. ఆర్థిక నేరగాళ్లు వేలకోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తోంది’ అని స్పష్టం చేశారు. 

ఇక, నాటి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీర్మానం మేరకు.. 1963, ఏప్రిల్‌ 1వ తేదీన సీబీఐ ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ పర్యవేక్షణలో.. సీబీఐ పని చేస్తుంది. దేశంలో ఇప్పటిదాకా ఎన్నో హైప్రొఫైల్‌తో పాటు సంక్లిష్టమైన కేసుల్ని పరిష్కరించిన కేంద్రం అత్యున్నత దర్యాప్తు సంస్థగా సీబీఐకంటూ ఓ పేరు ఉండిపోయింది.

ఇదీ చదవండి: ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)