మోదీ టూర్ల ఖర్చు రూ. 362 కోట్లు!

Published on Sat, 07/26/2025 - 07:48

న్యూఢిల్లీ: ఐదేళ్లలో రూ.362 కోట్లు ఖర్చు అంటే.. ఇదేదో ప్రాజెక్టుకు అనుకునేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు. 2021 నుంచి 2025 మధ్య ఆయన విదేశీ పర్యటనలకోసం అక్షరాలా రూ.362కోట్లు ఖర్చయ్యాయి. ఒక్క 2025లోనే ఆయన పర్యటనలకోసం రూ.67కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో.. 

అమెరికా, ఫ్రాన్స్‌ ఉన్నతస్థాయి పర్యటనలు సహా ఐదు పర్యటనలు న్నాయి. రాజ్యసభలో తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌ అడిగిన ప్రశ్నకు సమా« దానంగా విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ ఈ వివరాలను రాజ్యసభకు అందించారు. ఈ డేటా ప్రకారం, 2025లో ప్రధాని పర్యటనల్లో అత్యంత ఖరీదైనది ఫ్రాన్స్‌ పర్యటన. దీనికి రూ. 25 కోట్లకు పైగా.. ఆ తర్వాత అమెరికా పర్యటనకు రూ. 16 కోట్లకు పైగా ఖర్చయింది. 

మారిషస్, సైప్రస్, కెనడా దేశాల అదనపు సందర్శనల ఖర్చులు ఇంకా వీటికి కలపలేదు.  ఇక 2024 లో రష్యా, ఉక్రెయిన్‌తో సహా 16 దేశాల్లో పర్యటించడానికి రూ.109 కోట్లు ఖర్చు చేశారు. 2023లో దాదాపు రూ.93 కోట్లు, 2022లో రూ.55.82 కోట్లు, 2021లో రూ.36 కోట్లు ఖర్చు చేశారు. 2021లో అమెరికా పర్యటనకే రూ.19 కోట్లకు పైగా ఖర్చయింది. ఇవి కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా.. పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు, ప్రసార ఖర్చుల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)