Breaking News

శతాబ్దాలు ఎదురుచూడాల్సి వచ్చింది: ప్రధాని మోదీ భావోద్వేగం

Published on Mon, 01/22/2024 - 14:49

అయోధ్య: అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం తన అదృష్టమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రామ్‌లల్లా ఇక టెంట్‌లో ఉండేపరిస్థితులు లేవని..  దివ్యమైన మందిర గర్భగుడిలోనే ఉంటారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. ఇది సామాన్యమైన సమయం కాదని.. కాల చక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయయని తెలిపారు. 

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో దేశమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వందల ఏళ్లు ఎదురుచూస్తున్న రామమందిరం కల సాకారమైంది. బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువుదీరాడు. భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ‍ప్రసంగం ప్రారంభించారు. రామ భక్తులందరికీ తన ప్రణామాలు తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడొచ్చాడన్న మోదీ.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని తెలిపారు. సేవా, చింతర, భక్తిని హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలని అన్నారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయమని చెప్పారు.

మోదీ ఇంకా మాట్లాడుతూ.. ‘సరయూ నది, అయోధ్యపురికి నా ప్రణామాలు. నా శరీరం ఇంకా అనుభూతిని ఆస్వాదిస్తోంది. రాముడు క్షమిస్తాడని నాకు నమ్మకం ఉంది. నా మనస్సంతా బాలరాముడి రూపంపైనే ఉంది. త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. రాముడి కోసం 14 ఏళ్లుగా ప్రజలు ఎదురు ఎదురు చూశారు. ఈ కలియుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
చదవండి: Ayodhya Ram Mandir: 500 ఏళ్ల కల నెరవేరింది: యోగి ఆదిత్యనాథ్‌

దేశం మొత్తం ఇవాళ దీపావళి జరుపుకుంటోంది. రామమందిర న్యాయబద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మించాం. 500 ఏళ్లుగా రామమందిర నిర్మాణం ఎందుకు జరగలేదో ఒకసారి అందరూ ఆలోచించండి. రాముడు భారతదేశ ఆత్మ. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టా. అన్ని రాష్ట్రాల్లోని ఉన్న రాముడి ప్రధాన ఆలయాలు దర్శించుకున్నాను. అన్ని భాషల్లోనూ రామాయనాన్ని విన్నాను. భాష ఏదైనా రాముడు అందరికీ ఆరాధ్య దైవం. రాముడు లోకానికి ఆదర్శం. రాముడు భారత్‌కు ప్రతిష్ట. రాముడు వివాదం కాదు.. రాముడు సమాధానం. రాముడే భారతదేశానికి విధానం. రాముడు నిత్యం, రాముడు నిరంతరం, రాముడు అనంతం.

బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భవించింది. ఈనెల గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది. ఈ ఘట్టం కోసం శ్రీరాముడు ఎన్నో శతాబ్ధాల పాటు ఎదురు చూశాడు. ఇంత ఆలస్యం జరిగింనందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి. దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇది మన నినాదం. త్రేతా యుగంలో రాముడు వచ్చాకే వేలయేళ్లపాటు ఈ దేశం ప్రపంచాన్ని శాసించింది రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)