Breaking News

కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లకండి: మోదీ

Published on Wed, 01/24/2024 - 18:18

లక్నో: ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించడం మానుకోవాలని  కేబినెట్ మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత భక్తులు భారీ సంఖ్యలో రామమందిరానికి తరలి రావడంతో మోదీ ఈ మేరకు మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర మంత్రులు మార్చి నెలలో  అయోధ్యను సందర్శించనున్నట్లు తెలుస్తోంది.

వీఐపీల సందర్శనలో ప్రోటోకాల్‌ల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అయోధ్యకు వెళ్లే ప్రణాళికను మంత్రులు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రధాని మోదీ మంత్రులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

సోమవారం అయోధ్య ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. ఈ వేడుకను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలతో సహా అనేక వేల మందిని కార్యక్రమానికి ఆహ్వానించారు. సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆహ్వానితులు దేవుడి దర్శనం చేసుకున్నారు.

సాధారణ ప్రజల కోసం మంగళవారం ఉదయం ఆలయ తలుపులు తెరవబడ్డాయి. మొదటి రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో మంగళవారం దర్శనానికి కొద్దిసేపు విరామం ఇవ్వాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే!

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)