Breaking News

మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ

Published on Mon, 03/11/2024 - 18:42

న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ విజయవంతమైంది. మిషన్‌ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌(ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో అగ్ని-5 రేంజ్‌.. 7 వేల కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది.

మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతంతో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని ట్వీట్‌ చేశారు. అగ్ని-5 క్షిపణి ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదిందించి. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో డీఆర్డీవో మిస్సైల్‌ను రూపొందించింది. ఎంఐఆర్‌వీ సాంకేతికతతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం దేశం రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని మోదీ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మిషన్​ దివ్యాస్త్ర అతిపెద్ద అడ్వాన్స్‌డ్‌ వెపన్స్ సిస్టమ్‌గా తెలుస్తోంది. దీనికి దేశ భౌగోళిక స్థితిగతులను మార్చే సత్తా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎంఐఆర్‌వీ టెక్నాలజీతో ఒక మిసైల్‌ను ఉపయోగించి బహుళ వార్ హెడ్స్‌ను వివిధ ప్రాంతాల్లోని టార్గెట్స్‌ను ఛేదించవచ్చని పేర్కొన్నాయి. అయితే, ఈ టెక్నాలజీ కలిగిన దేశాల సంఖ్య తక్కువగా ఉండగా.. ఆయా దేశాల సరసన భారత్‌ సైతం చేరినట్లయ్యింది. ఈ అగ్ని-5 మిసైల్‌లో ఇండీజీనియస్ ఏవియోనిక్స్ సిస్టస్స్‌ ఉంటాయి. హై ఎక్యురసీ సెన్సార్​ ప్యాకేజ్‌ ఉండడంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)