Breaking News

ప్రధాని మోదీ నోట బ్రియాన్ డి ఖర్ప్రాన్‌ పేరు.. ఎవరీయన?

Published on Sun, 08/27/2023 - 20:57

ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు(ఆదివారం) మన్‌కీ బాత్‌ 104వ ఎపిసోడ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మేఘాలయవాసి బ్రియాన్ డి ఖర్ప్రాన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రియాన్ తన బృందంతో కలిసి మేఘాలయాలో 1700లకు పైగా గుహలను కనుగొన్నారని చెప్పారు. బ్రియన్ చేసిన సేవలను కొనియాడారు. మేఘాలయ గుహలను సందర్శించాలని దేశ ప్రజలను కోరారు. 

ఎవరు ఈ బ్రియాన్ డి ఖర్ప్రాన్‌ ?
మన్‌ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ బ్రియాన్‌ గురించి చెప్పారు.'1964లో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రియాన్ డి ఖర్ప్రాన్‌ గుహలను కనుగొనడం ప్రారంభించారు. 1990నాటికి ఆయన తన స్నేహితులతో కలిసి ఓ సంఘాన్ని స్థాపించారు. వారందరూ కలిసి మేఘాలయాలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో గుహలను వెలుగులోకి తీసుకువచ్చారు. బ్రియాన్ డి ఖర్ప్రాన్‌ తన బృందంతో కలిసి 1700పైగా గుహలను కనిపెట్టారు. ప్రపంచ పటంలో మేఘాలయా గుహలకు స్థానం వచ్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అత్యంత లోతైన, పొడవైన గుహలు ఉన్నాయి' అని ప్రధాని మోదీ చెప్పారు.    

 టూరిస్టులు మేఘాలయా గుహలను తమ ప్రణాళికలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. దేశంలోనే చాలా పొడవైన, లోతైన గుహలు మేఘాలయాలో ఉన్నాయని తెలిపారు. అది బ్రియాన్ చేసిన కృషి ఫలితమేనని అన్నారు. మేఘాలయ అడ్వెంచరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసిన బ్రియాన్ డి ఖర్ప్రాన్ ఇప్పటివరకు రాష్ట్రంలోని 537.6 కి.మీ గుహలను చుట్టివచ్చారు.

ఇదీ చదవండి: మోదీ మన్‌కీ బాత్‌.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)