Breaking News

ఉద్యోగమా? పానీ పూరీ అమ్ముకోవడమా? ఏది బెటర్‌: వైరల్‌ వీడియో

Published on Thu, 10/19/2023 - 17:59

కార్పొరేట్‌, లేదా టెకీ ఉద్యోగం అంటేనే అంతులేని పని ఒత్తిడి. పగలూ రాత్రీ తేడాలేని పనివేళలు,నిబంధనలతో పనిలేకుండా గంటలకొద్దీ అలా పని చేయాల్సిందే. ఇలాంటి సవాలక్ష సవాళ్లు ఉద్యోగం అంటేనే నిస్తేజం. జీవితం గడవాలి కాబట్టి  ఎలాగోలా తట్టుకుని నెట్టుకొస్తున్నా ఇటీవలి కాలంలో  లేఆఫ్స్‌ భూతం ఉద్యోగులను మరింత వేధిస్తోంది. ఆర్థికమాంద్యం, ఖర్చుల తగ్గింపు  పేరుతో అనేక కార్పొరేట్‌  కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన మూడు రోజుల్లోనే 20.3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పారిశ్రామికవేత్త హర్షగెయెంకాను ఈ వీడియోను ఆకర్షించింది.   ఆయన  కూడా ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  

కార్పొరేట్‌ ఉద్యోగం కంటే..పానీ పూరీ విక్రయించుకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా ‍స్పందించారు. కొందరు ఇదొక విషాదకర పరిస్థితి అని అంటే, మధ్య తరగతి వాళ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి ప్రజలు ధనవంతులు. ఎందుకుంటే వారు ఖర్చు తక్కువ పొదుపు ఎక్కువ చేస్తారని మరొకరు కామెంట్‌ చేశారు. మరో యూజర్‌ ఏమన్నారంటే పానీ పూరి వ్యాపారి ఎక్కువ సంపాదించినా కూడా కార్పొరేట్ ఉద్యోగికి గౌరవం లభిస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అలాగే  కార్పొరేట్ ఉద్యోగులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణంలో పనతోపాటు ఉద్యోగ భద్రత కూడా ఎక్కువే. టైంకి జీతం రావడం, ఆరోగ్య బీమా, పదవీ విరమణ  ప్రణాళికల్లాంటివి ఉంటాయి. (యూట్యూబ్‌ కింగ్‌ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చేశాడు!)

కార్పొరేట్ ఉద్యోగులు  ఉద్యోగపరంగా మరింతపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తులు, ఇతర నిపుణులతో కలిసి పనిచేయడం లేదా ప్రసిద్ధ కంపెనీలో పని చేయడం అనేది వారికి వ్యక్తిగతంగా తృప్తినిస్తుంది.  అయితే కార్పొరేట్ ఉద్యోగిగా ఉండాలా లేక పానీ పూరి వ్యాపారిలా ఉండాలి అనే నిర్ణయం వైయుక్తికమైంది.  ఏది మంచి, ఏది చెడు అనేది వారి వారి  ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)