Breaking News

అయోద్యలో రామమందిర ప్రారంభానికి ముందు.. హైకోర్టులో పిటిషన్‌

Published on Wed, 01/17/2024 - 17:19

చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరం  ప్రారంభోత్సవానికి  సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 22న జరిగే రామ మందిరంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం పుష్క మాసం నడుస్తుందని.. హిందూ క్యాలెండర్‌ ప్రకారం ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. శ్రీరాముని ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని.. నిర్మాణంలో ఉన్న ఆలయంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్టించడం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అధికార బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆరోపించారు.
చదవండి: ఆయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?

ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనుంది.  ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం పాల్గొంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠపై శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు’ అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

మరోవైపు  అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)