Breaking News

గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు

Published on Tue, 10/01/2024 - 09:28

న్యూఢిల్లీ: పితృ పక్ష అమావాస్యనాడు పెద్దలకు పిండ ప్రదానం చేయడమనేది హిందువుల్లో ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న పితృపక్ష అమావాస్య. పెద్దలకు పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతుంటారు. అలాగే పిత్ర దోషం కూడా తొలగిపోతుందని అంటారు. పిండ ప్రదానం చేసేందుకు దేశంలోని గయతో పాటు కొన్ని ప్రాంతాలు శ్రేష్టమైనవని చెబుతారు. అవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హరిద్వార్
హరిద్వార్‌లోని నారాయణి శిల దగ్గర పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారిపై పూర్వీకుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని, వారి జీవితంలో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయని చెబుతుంటారు.

2.బుద్ధగయ
బీహార్‌లోని ఫల్గు నది ఒడ్డున ఉన్న బుద్ధగయ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసేందుకు విదేశాల నుండి కూడా తరలివస్తారు. విష్ణుపురాణం, వాయుపురాణాలలో దీనిని మోక్షభూమి అని పేర్కొన్నారు. దీనిని విష్ణు నగరి అని కూడా అంటారు. విష్ణువు స్వయంగా పితృదేవత రూపంలో ఇక్కడ ఉన్నాడని, బ్రహ్మ స్వయంగా తమ పూర్వీకులకు ఇక్కడే పిండప్రదానాన్ని చేశారని చెబుతారు.
 

3. కురుక్షేత్ర
హర్యానాలోని కురుక్షేత్రలో పితృపక్ష అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మహాభారతంలోని వివరాల ప్రకారం ధర్మరాజు తన కుటుంబ సభ్యులకు  ఇక్కడే పిండప్రదానం చేశాడు.

4. కాశీ
కాశీలో పిండప్రదానం చేయడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతుంటారు. కాశీలోని పిశాచ మోచన్ కుండ్  సమీపంలో మూడు మట్టి పాత్రలను ఉంచి, పిండ ప్రదానం చేస్తారు. ఆరోజున నలుపు, ఎరుపు, తెలుపు జెండాలను ఎగురవేస్తారు. ఇక్కడ  పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షప్రాప్తి కలుగుతుందంటారు. కాశీని మోక్షపురిగా కూడా పిలుస్తారు.

ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)