నా షో వస్తుంది చూడు నాన్న ..!

Published on Sat, 11/22/2025 - 15:27

నిన్న దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో తేజస్ ఫైటర్ కుప్పకూలడంతో భారత ఫైలట్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన వివరాలు యూట్యూబ్ రీల్స్ చూస్తుండగా తెలిసిందని ఆయన తండ్రి మీడియాతో తెలిపారు. ఈ ఘటన వివరాలు తెలియగానే తన కోడలికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు గొప్ప స్థానాల్లో ఉంటే చూడాలని కలలుగంటారు. ఇక వారి పిల్లల గొప్పతనాన్ని ఏవరైనా ప్రశంసిస్తే ఇక వారి ఆనందానికి అవదులే ఉండవు. అయితే తమ పిల్లల గొప్పతనాన్ని చూసి సంబరపడిపోదామనుకున్న తల్లిదండ్రులకు వారు మృతిచెందడం చూడాల్సి వస్తే ఇక ఆ బాధ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఆ సమయంలో వారు ప్రత్యక్ష నరకమే అనుభవిస్తారు. నిన్న దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షో అటువంటి చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది.  దుబాయ్ లో జరిగిన ఎయిర్ షో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతుందని దానిని చూడాలని వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ తన తండ్రికి చెప్పారు. దీంతో ఎంతో సంబురంగా తన కొడుకు ప్రతిభను చూడాలనుకున్న  తండ్రికి ప్రమాదంలో కుమారుడు మృతి చెందడం చూడాల్సి వచ్చింది.

దుబాయ్ లో జరిగిన ఎయిర్ క్రాష్ ఘటనపై వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ తండ్రి స్పందించారు. " నిన్న 4 గంటల ప్రాంతంలో  ఎయిర్ షో లైవ్ వీడియోల కోసం యూట్యూబ్ లో వెతుకుతున్నాను. అప్పుడే జెట్ క్రాష్ అయిందనే సంగతి నాకు తెలిసింది. దీంతో వెెంటనే తన కోడలుకు కాల్ చేశానని, కొద్ది సేపటికే ఐదుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు తమ ఇంటికి రావడంతో ఎదో జరిగిందని నాకు అర్థమైంది" అన్నారు. ఈ ప్రమాద ఘటనకు ఒకరోజు ముందే తన కొడుకుతో మాట్లాడనని ఎయిర్ షో టీవీలో వస్తుంది చూడాలని  తనకు తెలిపాడన్నారు.

నమాన్ష్ సయీల్ తండ్రి హిమాచల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా రిటైరయ్యారు. సయీల్ భార్య సైతం ఐఏఎఫ్ లో వింగ్ కమాండర్‌గా విధులు నిర్వహిస్తుంది. నిన్న దుబాయ్ లో జరిగిన ఎయిర్ షోలో ప్రమాదవశాత్తు తేజస్ ఫైటర్ కూలి వింగ్ కమాండర్ సయీల్ మృతి చెందారు. 
 

#

Tags : 1

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)