Breaking News

పాడుబడిన బావిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం

Published on Thu, 10/24/2024 - 07:36

పిలిభిత్: ‘నోట్ల వర్షం కురిసింది’ అనే మాటను మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. అయితే ఇంతకీ నోట్ల వర్షం కురుస్తుందా? కురిస్తే ఎలా ఉంటుంది? దీనిని తెలుసుకోవాలంటూ యూపీలోని పిలిభిత్‌లో జరిగిన ఒక ఉదంతాన్ని తెలుసుకోవాల్సిందే..

యూపీలోని పిలిభిత్‌లో  ఒక పాడుబడిన బావిలోంచి నీటితోపాటు నోట్లు రావడం మొదలైంది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో ఈ నోట్లను దక్కించుకునేందుకు వేలాది మంది బావి దగ్గరకు చేరుకున్నారు. అయితే ఈ నోట్లను దక్కించుకున్నవారు నిరాశగా వెనుదిరిగారు. దీనికి కారణం ఆ నోట్లన్నీ చినిగిపోయి ఉన్నాయి. ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతోంది.

పిలిభిత్‌లోని బిసల్‌పూర్ తహసీల్‌కు చెందిన మొహల్లా గ్యాస్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  అక్కడి మహాదేవ్ ఆలయానికి వెళ్లిన కొందరికి సమీపంలోని బావిలో 10, 20, 50, 100 రూపాయల నోట్లు కనిపించాయి. ఈ వార్త తెలిసిన వారంతా పరుగు పరుగున ఆ బావి దగ్గరకు చేరుకున్నారు.  వివిధ పద్ధతుల్లో ఆ నోట్లను బయటకు తీశారు. అయితే ఆ నోట్లన్నీ చినిగిపోయిన స్థితిలో ఉండటంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. కాగా ఆ బావిలోకి నోట్లు ఎలా వచ్చాయనేది ఇంకా తేలలేదు.  ఈ ఉదంతంపై బిసల్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు?

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి