Breaking News

శబరిమల దర్శనాలు.. ట్రావెన్‌కోర్ బోర్డు కీలక ప్రకటన

Published on Thu, 10/30/2025 - 08:59

తిరువనంతపురం: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు సంబంధించి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన వెల్లడించింది. మకరవిళక్కు(మకరజ్యోతి) పూజ సమయంలో రోజుకు 90,000 మంది భక్తులను అనుమతించాలని తాజాగా బోర్డు సమావేశంలో నిర్ణయించింది. భక్తుల దర్శనాలకు సంబంధించిన బుకింగ్స్‌ నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 70,000 మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 20,000 మంది భక్తులు దర్శనం కోసం స్లాట్స్‌ బుక్ చేసుకోవచ్చు అని పేర్కొంది.

ఇక, అయ్యప్ప భక్తులు ఏటా 41 రోజులు దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. మకరజ్యోతిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు దీక్షను విరమిస్తారు. తన భక్తులను ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామే స్వయంగా మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్మకం. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలిగి, నేరుగా భగవంతుడిని చేరుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడని నమ్ముతూ ఉంటారు. ఇక రామాయణంలో కూడా శబరిమల ప్రస్తావన ఉండటం గమనార్హం. రాముడు పంబా నదీ తీరంలోని శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు చెబుతారు.

భక్తుల కోసం ప్రత్యేక బస్సులు
మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలకు వచ్చిన భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. గతేడాది మకర జ్యోతి దర్శనం అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పంపా నుంచి బస్సులను నడిపింది. ఇటు ఏపీ, తెలంగాణ నుంచి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 
 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)